Samantha – Naga Chaitanya : అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. చైతూ, సామ్ కలిసిపోయినట్లేనా..?

Samantha – Naga Chaitanya : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవ్ బుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య జోడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన వీరు.. ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకొని ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఒక్కటి అయ్యారు. వివాహం తర్వాత సమంత సినిమాలకు దూరంగా ఉంటూ తన భర్త ఆలనా పాలన చూసుకుంటూ వచ్చింది. ఇక పెళ్లయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రం మజిలీ. ఇందులో చాలా అద్భుతంగా నటించారు.. రీల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి ఏ మాత్రం తీసిపోకుండా తమ నటనతో చిత్రాన్ని బ్లాక్ బాస్టర్ విజయం సాధించేలా చేశారు.

samantha post on valentines day
samantha post on valentines day

ఇకపోతే ఏమైందో తెలియదు కానీ గత రెండు సంవత్సరాల క్రితం నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టు ప్రకటించి అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించారు. కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు, అభిమానులు ఎంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా సరే వారు విడాకులు తీసుకున్నారు . కానీ అందుకు గల కారణాలు మాత్రం చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే సమంత నాగచైతన్య మళ్ళీ కలిసి పోవాలని అభిమానులు ఎంతో ఆరాటపడుతున్నారు అలాంటివారికి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

తాజాగా నాగచైతన్య బాధలో ఉండగా సమంత ఓదార్చే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు మెప్పింట చెక్కర్లు కొడుతోంది. అయితే మొదట్లో ఇది చూసినవారు నిజంగా సమంత నాగచైతన్య కలిసిపోయారు అంటూ సంబరపడ్డారు. కానీ ఆ వీడియో రివైండ్ చేస్తే అది నాగచైతన్య తాత మరణించినప్పుడు.. బాధలో ఉన్న నాగచైతన్యను సమంత ఓదార్చుతోంది. అయితే అదే వీడియోని ఇప్పుడు ఎవరో సమంత, నాగచైతన్య అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు సమాచారం. అయితే వీడియో పాతదే అయినా సరే వీళ్ళిద్దరూ కలిసి ఉన్న వీడియో చూసేసరికి అభిమానుల ఆనందానికి అవ్వదులు లేకుండా పోయాయి.