Murali Mohan : మురళీమోహన్ ఆస్తులు పోవడానికి కారణం అదేనా..? 

Murali Mohan : ఎప్పుడు వార్తల్లో నిలిచే అతి కొద్దిమంది నటీనటులలో మురళీమోహన్ కూడా ఒకరు.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత సినిమాలతోనే బిజీగా ఉన్నా.. నిర్మాణరంగంతో పాటు వ్యాపారాలలో కూడా తన సమయాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా వయసు పైబడినా సరే ఎక్కడ వెనక్కి తగ్గకుండా దూసుకుపోతున్న ఈయన రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టబడులు పెడుతున్నారు. జయభేరి పేరుతో భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్న ఈయన.. 350 కి పైగా సినిమాలలో నటించి 25 కు పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూకి హాజరైన మురళీ మోహన్ తన ఆస్తులు పోవడానికి కారణం ఒక సినిమా అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు.

Advertisement
is this reason to Murali Mohan lost his property..!
is this reason to Murali Mohan lost his property..!

మణిరత్నం గారితో తీసిన “ఇద్దరూ” సినిమాతో సంపాదించిందంతా పోగొట్టుకున్నాను అంటూ అసలు విషయాన్ని రివీల్ చేశారు. ఈ సినిమాను నమ్మి కోట్ల రూపాయలు బడ్జెట్ గా పెడితే ఈ సినిమా మాత్రం భారీ డిజాస్టర్ ను చవిచూసింది. దీంతో ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది అంటూ తెలిపారు మురళీమోహన్. ఇక తరువాత కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేశాను. అందుకే నేను నిర్మించిన సినిమాలలో 75% సినిమాలు సక్సెస్ అయ్యాయి అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement
Advertisement