Alitho Saradaga : ఆలీ షో ముగిసినట్టేనా..?

Alitho Saradaga : ప్రముఖ కమెడియన్ ఆలీ ఈటీవీలో ఆలీతో సరదాగా షో కి హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో భారీ స్థాయిలో పాపులారిటీని దక్కించుకుంది. ముఖ్యంగా ఎంతో మంది సెలెబ్రిటీలు బయట ఇంటర్వ్యూలు ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కానీ ఆలీ షో కి మాత్రం హాజరయ్యారు. అలాంటి వారిలో అల్లు అరవింద్, మోహన్ బాబు, మంచు లక్ష్మి , ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఎస్పీ చరణ్ లాంటి చాలామంది తో ఆలీ ఇంటర్వ్యూలు చేశారు. మొత్తం 300కు పైగా ఇంటర్వ్యూలు ఆలీ చేయడం సరికొత్త రికార్డు అని చెప్పాలి.

Is this end of Ali show..!
Is this end of Ali show..!

మంచు లక్ష్మి తో స్టార్ట్ అయిన ఈ షో సుమ రివర్స్ ఇంటర్వ్యూ తో ముగిసింది. త్వరలో మరో మంచి షో తో మీ ముందుకు వస్తా అని అన్నారు కానీ వస్తారా? అన్నది ఇప్పుడు అనుమానం మొదలైంది. అయితే ప్రస్తుతం ఆలీ డిజిటల్ మీడియా అడ్వర్టైజర్ గా పదవి దక్కడంతో ఆయన ఈ షో కి గుడ్ బై చెప్పబోతున్నారని సమాచారం. అందుకే నిర్వాహకులు కూడా ఈ షోని క్లోజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఆలీ తన కొత్త పదవితో ఈ షోకి దూరం అవడంతో ఈ షో కూడా త్వరలోనే క్లోజ్ చేయబోతున్నారని సమాచారం. అందుకే ఈ షో ప్రోమో వదిలినప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ద సీజన్ అని కూడా హింట్ ఇవ్వడం జరిగింది.