బిగ్ బ్రేకింగ్ : బాయ్స్ సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్ లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ తర్వా వరుస సినిమా ఆఫర్లతో దూసుకెళ్లాడు.. ఇటీవల మహా సముద్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. మహాసముద్రం సినిమాలో హీరోయిన్ గా నటించిన అదితి రావు హైదారి తో సిద్ధార్థ ప్రేమాయణం నడుపుతున్నాడని గత కొన్నారుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది.
వీళ్ళిద్దరూ కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారని సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆ మధ్య పలుచోట్ల జంటగా కనిపించిన వీరు శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి జంటగానే వచ్చారు.. దాంతో ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం పై మళ్లీ రూమర్స్ ఊపందుకున్నాయి.. వీరు ఓకే లాంటి టైప్ షర్టులు వేసుకొని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే.
దాంతో వీళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ కాస్త క్లారిటీ ఇస్తూ వచ్చారు.. అయితే వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ నేటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తాజాగా వీళ్ళిద్దరి పెళ్లి గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అయితే వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్న మాట వాస్తవమే కానీ.. పెళ్లి మా ఇద్దరికీ కలిసి రాలేదని వారిద్దరూ వారి సన్నిహితుల దగ్గర వెల్లడించినట్లు సమాచారం.. దీనిని బట్టి చూస్తుంటే.. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండా రిలేషన్ లోనే ఉండాలని అనుకుంటున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.. దాంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా.. లేదంటే ఇలానే ఉండు కాలం వెలదీస్తారా అనేది తెలియాల్సి ఉంది..