Ramoji Rao : రామోజీరావు గురించి తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు మాత్రమే చూడండి !

Ramoji Rao : రామోజీరావు 1936 నవంబర్ 16వ తేదీన కృష్ణాజిల్లా పెదపారుపూడి గ్రామంలో జన్మించారు. తన తాతయ్య చనిపోయిన మూడు రోజులకే రామోజీరావు పుట్టడంతో ఆయనకి రామయ్య అనే పేరు పెట్టారు. రామోజీ ఫిలిం సిటీ ని కలిగి ఉన్న రామోజీస్ గ్రూప్ అధినేత రామోజీరావు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రామోజీ గ్రూప్ యాజమాన్యంలోని కొన్ని సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిలిం సిటీ లో ఆయనకు వ్యాపారలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటళ్లకు రామోజీరావు చైర్మన్ కూడా.. చిట్ నిధుల కోసం డబ్బులు వసూలు చేసేందుకు గతంలో ప్రభుత్వం తో పోరాడారు.

రామోజీరావు తన సొంత ఊరైన పెదపారుపూడి గ్రామంలో పలు సేవా కార్యక్రమాలను చేశారు. ఇప్పటికీ వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ ఊరు గ్రామ ప్రజలందరికీ ఉచిత కుళాయి నీటి పంపులను ఆయనే స్వయంగా ఏర్పాటు చేశారు. పశువుల హాస్పిటల్ కట్టించారు. సొసైటీ కట్టించారు. సొంతంగా ఓ స్కూలు కూడా నిర్మించారు. ఎలిమెంటరీ స్కూలు ఒకటి, టెన్త్ క్లాస్ చదువుకునే విధంగా పిల్లలకు స్కూల్స్ మూడు అంతస్తుల భవంతుని నిర్మించారు. వాటర్ ట్యాంక్ నిర్మించారు. గ్రామాలలో విద్యుత్ దీపాలకు పోల్స్ స్తంభాలను ఆయనే వేయించారు. తన సొంత గ్రామానికి రామోజీరావు ఎనలేని సేవలను అందించారు.

ఈ వీడియోలో మీరు ఆయన స్వగ్రామంలో చిన్ననాటి ఇంటిని వీడియోలు చూడొచ్చు. రామోజీ ఫిలిం సిటీ స్థాపించిన రామోజీరావు తన సొంత ఊరిలో స్కూల్స్, కాలేజీ, డ్రైనేజీ, నీటి సదుపాయం, రోడ్లు తోపాటు పలు సేవా కార్యక్రమాలను చేశారు. అయినా వ్యాపార రంగంలోకి రాకముందు ఆయన కూడా వ్యవసాయం చేశారు. కౌలుకి పొలం తీసుకుని నాగలి పట్టి దుక్కి దున్నారు. మమకారంతోనే ఇప్పటికీ ఆయన ఆ ఊరికి ఎన్నో సేవలు చేస్తున్నారు. అన్నదాత అనే వ్యాపార పత్రికను కూడా విడుదల చేశారు. ఆ ఊరిలోని ప్రతి మనిషికి ఆయన ఏదో ఒక విధంగా సహాయపడ్డారని ఆ ఊరు వాసులు గర్వంగా రామోజీరావు గురించి చెప్పారు.

Intresting unknown facts about ramoji rao
Intresting unknown facts about ramoji rao

రామోజీరావు కి ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటును అందించింది. శ్రీ వెంకటేశ్వర విద్య విశ్వవిద్యాలయం, శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటును అందించింది. యుద్ధ వీర్ అవార్డుని కూడా ఆయన అందుకున్నారు. కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి రాజస్థాన్ అవార్డును కూడా పొందారు. బీడీ గోయాంక అవార్డును కూడా రామోజీరావు పనికి సేవలకు గాను పురస్కారాలు అందుకున్నాడు. 2016లో సాహిత్యం, విద్యా విభాగాలలో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు రామోజీరావు. ఆయన 21 పైగా చిత్రాలను నిర్మించారు అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.