Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. టిఆర్పి రేటింగ్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటుంది.. కార్తీకదీపం కు గట్టి పోటీ ఇస్తూ రెండవ స్థానంలో నిలుస్తుంది.. గత వారంలో కూడా రెండో స్థానంలో నిలిచినప్పటికీ.. ఈ వారంలో రేటింగ్ లో మాత్రం పుంజుకుంది.. గత వారం 9.99 టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకోగా.. ఈ వారం 10.87 రేటింగ్ తో దూసుకెళ్తోంది.. కార్తీకదీపం కు సమవుజ్జీగా నిలుస్తుంది.. ఈ సీరియల్ గత వారం జరిగిన హైలెట్స్ తోపాటు ఈవారం ఈ సీరియల్ ఎటు వైపు మలుపు తిప్పుతారో చూద్దాం..!

ప్రవళిక పాత్రతో తులసి లో సరికొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపి.. ఇప్పటివరకు ఉన్న ఇంటింటి గృహలక్ష్మికి సరికొత్త రంగులు దిద్ది.. నేటి ఆధునిక యుగానికి ఇంటింటి గృహలక్ష్మి ఏ విధంగా సెట్ అవుతుందో.. ఆ విధంగా తులసి పాత్రను తీర్చిదిద్దే ఈ విధంగా సాగుతుంది ఇంటింటి గృహలక్ష్మి సీరియల్.. మొత్తానికి తులసి సంగీతం టీచర్ అంటూ కొత్త అవతారం ఎత్తింది. సంగీతం చెప్పుకుంటూ తులసి తనలో ఉన్న మరో కొత్త యాంగిల్ ని అందరికీ పరిచయం చేసింది.. తులసి ఏ విషయం లోనూ తక్కువ కాదని నూతన ఉత్సాహాన్ని నింపుకుంటూ.. టీచర్ గా అడుగులు ముందుకు వేయడానికి యూట్యూబ్ లో తన సందేహాలను నివృత్తి చేసుకుంటూ.. తనకు తానే మెరుగులు దిద్దుకుంటోంది.. అందరి చేత తన పాటలతో శభాష్ అనిపించుకుంటుంది..
నందు లో వచ్చిన మార్పులను చూస్తుంటే లక్కీ చేత డాడీ అని పిలిపించుకోవాలని కుతూహల పడుతున్నాడు. లక్కీ మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోనని ఇప్పటికే పలు సార్లు నందు ముందు స్పష్టం చేశాడు. లక్కీ కి నందు దగ్గర ఉన్న కొద్ది నువ్వు ఎప్పటికీ నాకు దూరమే అన్నట్టు లక్కీ ఇండైరెక్ట్ గా చెబుతూనే ఉన్నాడు. నందులో వచ్చిన మార్పును చూసి లాస్య చాలా ఆనందిస్తుంది. లక్కీని ఒప్పించే దిశగా లాస్య ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది..
నందు ఉద్యోగం కోల్పోవడం ఇంట్లో ఉండటం అది లాస్య నచ్చక పోగా తన ఫ్రెండ్ కంపెనీలో ఇంటర్వ్యూ తీసుకువెళుతుంది తన జూనియర్ అయిన రమేష్ నందు ముందే లెవెల్ వేయడంతో తను అనే మాటలకు నందు చిన్నబుచ్చుకున్నాడు తన లోపల దాగి ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకుని తనపై గొడవపడి నందు బయటకు వచ్చేస్తాడు. ఇక నందు ని ఎలాగైనా ఒక కంపెనీకి సీఈవో చేసే బాధ్యత లలో నిమగ్నమవుతుంది లాస్య.. తన ఫ్రెండ్ తో ఒప్పందం కుదుర్చుకున్న లాస్య తను పెట్టబోయే కంపెనీలో మనీ ఇన్వెస్ట్ చేయమని అడుగుతుంది. అందుకు తను ఒప్పుకున్న తన భర్త ఒప్పుకోలేదని చెబుతుంది.. దీనంతటికీ కారణం అని తులసి నే అనుకుని తన ఇంటికి బయలు దేరుతుంది గొడవ చేయడానికి.. కానీ తులసి నేను ఎప్పటికీ తప్పు చేయనని ఖరాఖండిగా చెబుతోంది. దీని వెనక ఏదో పెద్ద విషయమే ఉంది. ఆ విశేషాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం.