Intinti Gruhalakshmi: తులసి టీచర్ ఎక్కడని ఇద్దరు పిల్లలు తులసి వాళ్ళ ఇంటికి వస్తారు.. అనసూయమ్మ తులసినీ అంత గౌరవంగా టీచర్, మేడం అని పిలిచే సరికి ఆనందంతో తబ్బిబ్బు లవుతుంది.. తులసి నీ కోసం ఫ్యాన్స్ వచ్చాను బయటికి రా అంటూ బయటకు తీసుకు వస్తుంది. మేడం మాకు కూడా సంగీతం నేర్పిస్తారా అని ఆ పిల్లలు అడుగుతారు తులసిని.. నేను సంగీతం నేర్పిస్తానని మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది తులసి. మీరే కదా మేడం ఇంటర్నెట్లో పోస్టు చేశారు. సంగీతం నేర్పిస్తానని అని అంటుంది. తులసిని అలా అడగగానే ఈ పని దివ్య చేసి ఉంటుంది అనుకొని దివ్య వైపు చూస్తుంది. నువ్వే కదా మామ్ రాత్రి సంపాదన లేదు అని బాధ పడుతున్నావు. అందుకే సోషల్ మీడియాలో సంగీత నేర్పబడును అని యాడ్ ఇచ్చాను అని చెబుతుంది..!

లాస్య నందును తీసుకుని తన ఫ్రెండ్ దగ్గరకు తీసుకువెళ్తుంది జాబ్ కోసం.. సతీష్ అప్పుడు తన తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. తన క్వాలిఫికేషన్ కి తగ్గట్టు ప్రోగ్రామర్ గా జాబ్ చేయడానికి నాకు ఇష్టం లేదు. నువ్వు కావాలనే నన్ను అవమానిస్తున్నవు అని తనతో గొడవ పడతాడు నందు. లాస్య ఎంతసేపటికీ నందును కూల్ చేసినా నందు తన ఆ మేనేజర్ తో గొడవ పడతాడు. కొంచెం సేపు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు కదా.. ఏదోలా మనేజ్ చేసుకుని మన పని అయిపోయేది కదా అని లాస్య అంటుంది. నేను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నీకు నెలకి జీతం ఇస్తే చాలా అని అంటాడు నందు..
ప్రేమ్ నిన్ను టిఫిన్ తినడానికి రమ్మంటే రావేంటి.. నీ కోసం ఎదురుచూస్తూ నేను తినేసాను. ఉప్మా, రైస్ రెండు చేసి అక్కడ పెట్టాను అంటుంది. శృతి తన జాబ్ కి వెళ్తుంది. ప్రేమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇల్లు వెతుక్కుంటూ ఇంటికి వస్తాడు.. మళ్ళీ పనిలోకి చేర్చుకోండి సార్ అని అంటాడు ప్రేమ్. ఇదంతా శృతి ఒక వైపు నుంచి చూస్తూ ఉంటుంది. కాఫీ తీసుకువచ్చి ఇస్తున్నటే ఇచ్చి కాఫీ తన మీద ఒలకబోస్తుంది.. లోలోపల శృతి నవ్వుకుంటూ నువ్వు నా ప్రేమ్ నే ఉద్యోగం లో నుంచి తిసేస్తవా.. నీ తిక్క తినిగింది అని మనసులో అనుకుంటుంది శృతి.