Inaya : ఇనయా సుల్తానా పరిచయం అక్కర్లేని పేరు.. ఎన్నో సినిమాల్లో నటించిన రాని గుర్తింపు ఆర్జీవితో చేసిన ఒకే ఒక్క ఇంటర్వ్యూ తో పాపులర్ అయింది ఇనయ.. ఇక అదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 6 లో ఆర్జీవి బ్యూటీగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇనయ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.. ఎవ్వరూ ఊహించని విధంగా బిగ్ బాస్ షో లో ఎలిమినేట్ అయింది. తన ఆట తీరు, పద్దతి నచ్చిన ఆమె ఫ్యాన్స్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ ఫ్యాన్స్ బిగ్‌బాస్ టీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు..

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇనయ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు చేరువగా ఉంటుంది.. తరచూ ఏదో ఒక ఫోటో షూట్ తో సందడి చేస్తూనే ఉంటుంది.. ట్రెడిషనల్ వేర్ లో ఇప్పటి వరకు ఆకట్టుకున్న బిగ్ బాస్ బ్యూటీ నయా ట్రెండు మార్చింది. లేటెస్ట్ స్టిల్స్ తో ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది. సరికొత్తగా కనిపించి గ్లామర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇనయ తన క్రష్ సోహైల్ ను కలిసింది.. అంతేకాదు తన మనసులో ప్రేమను బయట పెడుతూ ఓ వీడియో షేర్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది. ఇనయా రోజ్ ఫ్లవర్ బొకే తీసుకుని వెళ్లి సోహైల్ ముందు మోకాళ్ల మీద కూర్చుని మరీ ప్రపోజ్ చేసింది ఇనయా. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నాకు నువ్వంటే చాలా ఇష్టం అని సొహైల్ పై ప్రేమను కురిపించింది ఇనయ.
వాలెంటైన్ డే వీక్ మొదలైంది. ఈరోజు రోజు డే.. అందులో భాగంగా ఇనయ ఈరోజు సోహెల్ ను మీట్ అయి తనకి గులాబీ ఇస్తున్న వీడియో ను తన ఇన్స్టా స్టేటస్ లో పెట్టింది.. ఇనయ మరోసారి సొహెల్ పై తన ఇష్టాన్ని చెప్పింది.