Singer Sunitha : సింగర్ సునీత గతాన్ని ఒక్కసారి తెరిచి చూస్తే .. ‘ ఆ రోజు ‘ ఎప్పటికీ మరచిపోలేని బాధాకరమైన రోజు !

Singer Sunitha : టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో సింగర్ సునీత మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి అతి చిన్న వయసులోనే అడుగుపెట్టిన ఈమె గాయనిగా మరింత పాపులారిటీ సంపాదించుకుంది . నిజానికి ఈమెతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన ఎంతోమంది గాయని గాయకులు ప్రస్తుతం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటే.. సునీత మాత్రం వరుసగా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు సినిమాలలో అవకాశాలు అందుకుంటూనే.. మరొకవైపు అవకాశం వచ్చిన ప్రతీది సద్వినియోగం చేసుకుని ముందడుగు వేస్తున్నారు సునీత. ఈ క్రమంలోనే ఇటీవల వచ్చిన పాన్ ఇండియా సినిమా పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యరాయ్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేశారు సునీత.

సింగర్ గా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీత.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. అంతేకాదు దుర్భరమైన జీవితాన్ని కూడా అనుభవించింది. కష్టాలను ఎదురీదుంది.. నిజానికి 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కిరణ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది సునీత. ఇదే విషయాన్ని కుటుంబంలో చెప్పగా వారు నిరాకరించారు. ఇక కుటుంబాన్ని కాదనుకొని ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయింది సునీత . అలా అతడిని నమ్మి వివాహం చేసుకొని కొడుకు ఆకాష్ , కూతురు శ్రేయకు జన్మనిచ్చిన తర్వాత కిరణ్ అసలు స్వరూపం బయటపడింది. ఇక దానిని సునీత జీర్ణించుకోలేకపోయింది. ఎలాగైనా సరే అతడి నుంచి పిల్లలను కాపాడుకోవాలనే నేపథ్యంలో అతడికి విడాకులు ఇచ్చి శాశ్వతంగా వైవాహిక జీవితానికి దూరం అయింది.

If you look at the past of singer Sunitha
If you look at the past of singer Sunitha

ఆ తర్వాత ఎన్నో రూమర్స్, కాంట్రవర్సీలు, ట్రోల్స్, మరెన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని.. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలా కష్టాలను కడతేర్చే విధంగా విజృంభించింది.. సింగర్ సునీత గతాన్ని ఒక్కసారి తెరిచి చూస్తే .. తన భర్త చేసిన అన్యాయం ఎప్పటికీ మరచిపోలేని బాధాకరమైన రోజు అది.. ఇక ఈ క్రమంలోనే సునీత హృదయం లోపల కన్నీటి కష్టాలు ఉప్పొంగి పొర్లుతున్నా.. కష్టాల కడలిని ఈదుకుంటూ ముఖంపై చిరునవ్వు చిందిస్తూ ఉంటుంది. ఇన్ని కష్టాల్లో కూడా ఈ నవ్వు ఎలా సాధ్యమంటే.. అన్నింటిని చూసి వచ్చాను. దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అంటూ తాను ధైర్యంగా ఉండడమే కాకుండా ఎంతో మందికి ధైర్యం కూడా చెబుతుంది.. అందుకే సునీత అంటే అందరికీ ఇష్టం. ఇక సునీత రెండవ వివాహం చేసుకున్న తర్వాత తన వైవాహిక జీవితం కూడా పరిపూర్ణమైంది. ప్రస్తుతం ఆమె తన భర్త పిల్లలతో సంతోష జీవితాన్ని గడుపుతోంది.