RaviTeja : రవితేజ ధమాకా హిట్ కొట్టాలి అంటే ఈ మూడు ప్లస్ అవ్వాల్సిందే..?

RaviTeja : తాజాగా మాస్ మహారాజా రవితేజ.. యంగ్ హీరోయిన్ శ్రీ లీల జంటగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ధమాకా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లపై అభిషేక అగర్వాల్, TG విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న ట్రైలర్ విడుదల చేయగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 2గంటల 18 నిమిషాల రన్ టైం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
If Ravi Teja should be a big hit through damaka.. these three should be a plus..?
If Ravi Teja should be a big hit through damaka.. these three should be a plus..?

ఎప్పుడూ లేనివిధంగా ధమాకా సినిమా కోసం దాదాపు రెండు వారాలు నుండే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు రవితేజ.ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు కూడా చాలానే ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమాలో సాగదీత సన్నివేశాలను తొలగించి తక్కువ రన్ టైం లాక్ చేశారు. ఈ మూడు సినిమాకు ప్లస్ అయితే ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని సమాచారం. మరి ఈ సినిమాతో రవితేజ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Advertisement
Advertisement