Prabhas : ప్రభాస్ పెళ్లి చేసుకోవాలి అంటే .. వాళ్ళ ఇంట్లోవాళ్ళు అతనికి పెట్టిన అతిపెద్ద కండీషన్ ఇదే ! 

Prabhas :  తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెదనాన్న కృష్ణంరాజు అండతో యంగ్ రెబెల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన పాన్ ఇండియా సినిమాలతో మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇదే ఏడాది కృష్ణంరాజు అనారోగ్య సమస్యతో మరణించడంతో ప్రభాస్ ఒంటరివాడయ్యాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. కృష్ణంరాజు మరణం ప్రభాస్ ను మరింతగా మానసికంగా కలచివేసింది. ఇప్పటికే పెళ్లి కావలసిన ముగ్గురు చెల్లెళ్లు ఇంట్లో ఉండగానే .. పెదనాన్న మరణం ఆయనను ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేస్తోంది. ఒకవైపు తన కుటుంబ బాధ్యతలు.. ఇంకొకవైపు పెదనాన్న కుటుంబ బాధ్యతలు.. ఒక్కడే మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

If prabhash get marriage.. biggest condition given to him by the housemates!
If prabhash get marriage.. biggest condition given to him by the housemates!

ఇప్పటికే నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా వివాహం చేసుకొని ప్రభాస్ ఇంకెప్పుడు వివాహం చేసుకుంటాడు అంటూ పలువురు రకరకాలుగా కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. కనీసం పెదనాన్న మరణంతోనైనా వివాహం చేసుకొని ఒక ఇంటివాడు అవుతాడు అనుకుంటే.. ఇప్పుడు ఈయన వివాహానికి కుటుంబీకులు అతిపెద్ద కండిషన్ పెట్టారట. ముఖ్యంగా ప్రభాస్ వివాహం చేసుకోవాలి అంటే కృష్ణంరాజు కూతుర్లైన.. ప్రసీదా , ప్రకీర్తి, ప్రదీప్తి వీరి ముగ్గురికి వివాహం జరిగిన తర్వాతనే ప్రభాస్ వివాహం చేసుకోవాలని ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కండిషన్ పెట్టినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒక అన్నగా ప్రభాస్ తన ముగ్గురు చెల్లెళ్లకు వివాహం చేసిన తర్వాతనే తాను వివాహం చేసుకుంటే పద్ధతిగా ఉంటుంది అంటూ మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ పెళ్లి మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముగ్గురు చెల్లెళ్లను ఉన్నత కుటుంబాలకు ఇచ్చి వివాహం చేసిన తర్వాతనే ఆయన వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే ఆయన వివాహం ఎప్పుడు జరుగుతుందో అని అభిమానులు మరోపక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.