iBOMMA : బిగ్ షాక్.. ఆ రోజు నుంచి ఐబొమ్మ సేవలు పూర్తిగా బంద్..

iBOMMA : ఐబొమ్మ రెండు తెలుగు రాష్ట్రాలలోనీ సినీ ప్రేక్షకులకు ఈ పేరు తెలియని వారు ఉండరు.. థియేటర్ కి వెళ్లి సినిమా చూడలేనీ సామాన్యుడికి ఇది చక్కని ఓటీటీ వేదిక.. ఐ బొమ్మ పుణ్యమా అని ఇప్పుడు అందరూ ఎంచక్కా కొత్త సినిమాలను ఇంట్లోనే చూసేస్తున్నారు.. ప్రస్తుతం ఎన్నో ఓటీపీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్న సబ్స్క్రిప్షన్ కి పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది.. అందుకని అందరూ ఐ బొమ్మ వైపే చూస్తున్నారు.. పైగా ఈ వెబ్సైట్ ఇండియాలోనే బాగా ఫేమస్ అయింది.. తాజాగా ఐ బొమ్మ సినీ ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చింది.. ఐబొమ్మ సెప్టెంబర్ 9న నుంచి తమ సర్వీసులను పూర్తిగా నిలిపినట్లు ప్రకటించింది..

అంతేకాకుండా భవిష్యత్తులో తిరిగి తమ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం కూడా లేదని స్పష్టం చేసింది.. మా వెబ్సైట్ కి యూజర్స్ ఎవ్వరూ కూడా ఈ మెయిల్ చేయవద్దని కోరింది.. “హాయ్ ఐ బొమ్మ యూజర్స్.. మేము షాక్ అని సర్ప్రైజ్ కానీ ఇవ్వాలని అనుకోవడం లేదు.. చర్యలు తీసుకునే ముందు మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఐ బొమ్మ సేవలను శాశ్వతంగా మూసివేస్తున్నాం .. మేము ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాము. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం.. సెప్టెంబర్ 9 నుంచి ఇండియాలో ఐబొమ్మ సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నాం. భవిష్యత్తులో తిరిగి వచ్చే ఆలోచన కూడా లేదు..

iBOMMA services permanently closed on India
iBOMMA services permanently closed on India

యూజర్స్ ఎవరు మెయిల్స్ చేయవద్దు.. ఇంతకాలం మాపై చూపించిన ప్రేమకు అభినందనలు” అని ఐ బొమ్మ తమ వెబ్సైట్లో పేర్కొంది.. సామాన్యుడు థియేటర్ కు వెళ్లకుండా ఇన్ని రోజుల నుంచి ఐ బొమ్మ పైనే ఆధారపడి ఉన్నాడు.. ఈ వెబ్సైట్ ను ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా యూజర్ల డేటాను అమ్ముతున్నారని.. ఐ బొమ్మపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు సినీ పెద్దల నుంచి కూడా పలు విమర్శలు వస్తున్నాయి. దాంతో గత కొద్దిరోజులుగా ఐ బొమ్మ సినీప్రియలకు వరుసగా షాక్ ఇచ్చింది.. అందులో భాగంగానే ఇప్పుడు శాశ్వతంగా తమ సేవలను నిలిపి వేస్తున్నామని తెలియజేస్తూ మూవీ లవర్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది..

Advertisement