Adivi Sesh : అడవి శేష్ ఘోర అవమానం..! ఇలా జరిగిందేమిటి.!?

Adivi sesh  యంగ్ హీరో అడవి శేష్ నటించిన లేటెస్ట్ సినిమా హిట్ 2.. డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల అయ్యింది. హిట్ ది ఫస్ట్ కేస్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. శైలేష్ కొల‌ను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అడవి శేష్ పోలీసు అధికారిగా నటించి మెప్పించారు. ఈ సూపర్ హిట్ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది.

హిట్ 2 సినిమా ని బుధవారం జనవరి 4 నాడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేసింది. రెంట్ ప్రాతిపదికన వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. కానీ, ఆ తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి దీన్ని తొలగించింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో కనిపించడం లేదు. నిజానికి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ జనవరి 6, 2023 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.

కానీ, ముందుగానే స్ట్రీమింగ్ కు ఉంచింది. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేకుండా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి తొలగించింది. దీంతో యూజర్లు ఆశ్చర్యపోయారు. ఎందుకు ముందుగా విడుదల చేశారు? ఎందుకు మళ్లీ తొలగించారు? అనే విషయం తెలియక జుట్టు పీక్కుంటున్నారు. అటు ప్రైమ్ వీడియో కూడా తొలగింపుకు సంబంధించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ముందుగా ప్రకటించినట్లుగానే జనవరి 6 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఇది అడవి శేష్ కి ఘోర అవమానం అని ఆయన అభిమానులు భావిస్తున్నారు.