Prabhas : ప్రభాస్ ని ‘ అన్నయ్యా ‘ అని పిలిచిన బ్యూటిఫుల్ హీరోయిన్.. ఫ్యాన్స్ తో పాటు ప్రభాస్ కూడా ఉలిక్కిపడ్డాడు.!

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్.. నాలుగు పదులు దాటినా ఇంకా పెళ్లి కాలేదు.. ప్రభాస్ చూస్తే చాలు అని కొంతమంది అమ్మాయిలు అనుకుంటారు.. మరి కొంతమంది కనీసం సెల్ఫీ దిగితే చాలు అని అనుకుంటారు.. స్టార్ హీరోయిన్లు కూడా ప్రభాస్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి సై అంటున్నారు.. కానీ అంత క్రేజ్ ఉన్న ప్రభాస్ ను ఏకంగా ఓ హీరోయిన్ అన్నా అని పిలవడం.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..!!

Advertisement
Heroine fariya abdulla calls prabhas Anna is trending on social media
Heroine fariya abdulla calls prabhas Anna is trending on social media

ఇంతకీ ఆవిడ ఎవరో కాదు మన జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. ఫరియా ప్రస్తుతం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనే చిత్రంలో నటిస్తోంది.. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది.. ఈ శనివారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. నాచురల్ స్టార్ నాని గెస్ట్ గా హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. ప్రభాస్ అన్న అంటూ సంబోధించింది.. జాతిరత్నాలు సినిమా ట్రైలర్ ని ప్రభాస్ అన్న నే విడుదల చేశారు.. అది పెద్ద హిట్ అయింది.. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ని కూడా అన్నే రిలీజ్ చేశాడని.. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఆమె తెలిపింది..

Advertisement

ఫరియా అబ్దుల్లా ప్రభాస్ ని అన్నయ్య ని పిలవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. ఎంతో మంది స్టార్ హీరోయిన్లకు క్రష్ గా ఉండే ప్రభాస్ ని.. ఏకంగా అన్నయ్య అని పిలవడం ప్రభాస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఇప్పుడు ఫరియా ప్రభాస్ ని అన్నా అని పిలిస్తే మిగతా హీరోయిన్లు కూడా అదే ఫాలో అయిపోతే.. ప్రభాస్ పరిస్థితి ఏంటి అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వామ్మో అన్న అనేసింది రా అంటూ కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.. ఫరియా అబ్దుల్లా మాటలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి..

ఈ విషయంపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.. ప్రభాస్ ఇంకా మ్యారేజ్ చేసుకోలేదని ఇక అన్నగా మార్చేయాలని అనుకుంటున్నారా అంటూ.. మీమ్స్ తో వైరల్ చేస్తున్నారు నెటిజన్స్.. దాంతో ప్రభాస్ అన్న అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. ఫరియా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి.. బాహుబలి లాంటి కటౌట్ ఉన్న ప్రభాస్ ని ఒక్కసారిగా అన్నా అనడంతో అంతా షాక్ అయ్యారు..

Advertisement