Bhanu Priya : ‘ ఆ పార్ట్ కూడా పని చెయ్యట్లేదు ” దారుణమైన వ్యాధితో బాధ పడుతోన్న హీరోయిన్ భానుప్రియ !

Bhanu Priya : అలనాటి అందాల తార క్లాసికల్ డాన్సర్ భానుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తర్వాత కాలంలో అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి పరిమితమైంది. అలా అక్క, అత్త, వదిన పాత్రలతో ప్రేక్షకులను అలరించింది. సినీ ఇండస్ట్రీలో అందరి హీరోలతో కలిసి నటించిన ఈమె ప్రస్తుతం అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా శరీరంలో ఆ పార్ట్ కూడా పనిచేయట్లేదు అంటూ ఆమె ఎమోషనల్ అవుతూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం నిజంగా బాధాకరం.

heroine-bhanupriya-health-news-viral
heroine-bhanupriya-health-news-viral

 

అసలు విషయంలోకెళితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ కి హాజరైన భానుప్రియ తన పర్సనల్ అలాగే సినీ లైఫ్ గురించి కూడా ఓపెన్ అయింది. ఈ క్రమంలోనే తనకు మెమొరీ లాస్ వంటి వ్యాధి ఉంది అంటూ అఫీషియల్ గా ప్రకటించింది. ఆమె మాట్లాడుతూ.. ఈ వ్యాధి నాకు ఎలా వచ్చిందో కూడా తెలియదు. మా వారు చనిపోయారు. అప్పటి నుంచే నాకు ఇలాంటి సమస్యలన్నీ ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినింది.. నాకు ఏమీ గుర్తుండడం లేదు. ఒక ముద్ర చూసి అది దేనికి సంబంధించింది అని కూడా చెప్పలేకపోతున్నాను.

 

క్లాసికల్ డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నేను ఇప్పుడు డాన్స్ అంటేనే కష్టంగా మారిపోయింది. ఆ కారణంగానే నా డ్రీం ప్రాజెక్ట్ స్కూల్ ని కూడా ఆపేసుకున్నాను. నాకు తెలుసు ఈ జబ్బుకు సరైన చికిత్స లేదని.. కానీ కాలంతోపాటు నేను కూడా ముందుకు వెళ్తున్నాను అంటూ భానుప్రియ ఎమోషనల్ అయింది. అంతేకాదు ఇటీవల ఒక తమిళ సినిమా షూటింగ్లోకి వెళ్ళగా అక్కడ ఒక సన్నివేశానికి సంబంధించిన డైలాగులను యాక్షన్ చెప్పగానే మర్చిపోయాను అని.. ఆ తర్వాత కొద్దిసేపటికి తిరిగి సెట్ అయ్యానంటూ ఆమె తెలిపింది. మొత్తానికి అయితే భానుప్రియను తలుచుకుని అభిమానులు చింతిస్తున్నారు.