Hero Surya : తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళం తో పాటు తెలుగులో కూడా ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల విషయంలో సూర్య ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ.. వైవిద్య భరితమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటారు. వరుసగా హ్యాట్రిక్ హిట్ కొట్టిన సూర్య ఆ తరువాత పాన్ ఇండియా సినిమాకి సిద్ధమవుతున్నారు.. తాజాగా సూర్యకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
సూర్య తన కుటుంబం నుంచి దూరం అవుతున్నారన్న వార్త తమిళ్ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే సూర్య ఇంట్లో నుంచి బయటకు రావటానికి జ్యోతిక పరోక్షంగా కారణమైందనే బాధను కూడా వినిపిస్తోంది. తమిళం సీనియర్ యాక్టర్ బయల్వాన్ రంగనాథన్ చేసిన కామెంట్లను ఆధారం చేసుకుని రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చాలా రోజులుగా సూర్య కి అతని తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తీక్ కి సంబంధాలు సరిగ్గా లేవని గట్టిగానే న్యూస్ వినిపిస్తోంది. సూర్య జ్యోతికను పెళ్లి చేసుకోవడమే శివకుమార్ కి ఇష్టం లేదని.. ముందుగా వారి పెళ్లిని వ్యతిరేకించిన ఆ తర్వాత ఒప్పుకోక తప్పలేదని సమాచారం.
కాగా పెళ్లి తర్వాత వెండి తేరకు దూరమైంది జ్యోతిక. మళ్లీ ఇప్పుడు సినిమాలు చేయడంతో శివకుమార్ ఆ విషయాన్ని వ్యతిరేకించారట. దాంతో తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. ఆ విషయం కాస్త చిలికి చిలికి గాంధీ వానగా మారినట్లు దాంతో సూర్య తన కుటుంబం నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సూర్య ఒకవేళ తన కుటుంబం నుంచి దూరమైతే తన ఫ్యామిలీతో కలిసి ముంబైలో ఉండబోతున్నట్లు .మరో రూమర్ కూడా క్రియేట్ చేశారు మన సోషల్ మీడియా నాయకులు. ఇక ఈ వార్తలు నిజమవుతుందో తెలియాలంటే సూర్య కుటుంబం నుంచి ఎవరో ఒకరు స్పందించాల్సిందే.