Virat Kohli: ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని స్కంద సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ బిజీగా ఉన్నారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 28వ తారీకు విడుదల కాబోతోంది. పాన్ ఇండియా నేపథ్యంలో ఫస్ట్ టైం రామ్ సినిమా విడుదల కాబోతోంది. దక్షిణాదిలో తెలుగు భాషతో పాటు హిందీలో “స్కంద”లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నార్త్ లో నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ తాను “ఇస్మార్ట్ శంకర్” సినిమా చేశాక ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మాదిరిగా ఉందన్న కంపారిజన్ ఎక్కువైంది. ఒకవేళ బయోపిక్ చేయాల్సి వస్తే విరాట్ కోహ్లీ చేయాలనుకుంటున్నాను. అవకాశం వస్తే మాత్రం వదులుకోను. అవసరమైతే క్రికెట్ కూడా నేర్చుకుంటాను అని స్పష్టం చేశారు. విరాట్ బయోపిక్ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. భారత స్టార్ క్రికెటర్ విరాట్ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులు సృష్టించారు.
ఇండియాలో సచిన్ తర్వాత అత్యధిక రికార్డులు విరాట్ కోహ్లివే. ఎలాంటి బౌలర్ కైనా చుక్కలు చూపించడంలో విరాట్ ముందుంటాడు. చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. స్వదేశంలోనైనా విదేశాలలోనైనా విరాట్ కోహ్లీ క్రిజ్ లో ఉన్నాడంటే.. బౌలర్ బెబ్బెలెత్తిపోవాల్సిందే. అతి తక్కువ టైంలోనే ఎక్కువ సెంచరీలు పరుగులు చేసిన ఆటగాడిగా ఇంటర్నేషనల్ స్థాయిలో విరాట్ అనేక రికార్డులు సృష్టించడం జరిగింది. అటువంటి ప్లేయర్ బయోపిక్ లో నటించే అవకాశం హీరోకి వచ్చిన అతడికి క్రేజ్ మరింత పెరుగుద్ది అని చెప్పవచ్చు.