Health Benefits : రోజూ తులసి కషాయం త్రాగితే ఎన్ని లాభాలో..!

Health Benefits ; భారతీయ సంప్రదాయం ప్రకారం తులసి చెట్టును దేవతగా పూజిస్తారు. అన్ని మొక్కల కన్నా తులసి మొక్కకు ప్రత్యేక స్థానం వుంది. అంతే కాక తులసి ఆకులు ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి దివ్యౌషధంగా పనిచేస్తాయి. రోజూ తులసి కషాయం త్రాగటం వల్ల ఏ ఆరోగ్య సమస్య అయినా ఇట్టే తగ్గిపోతుంది. ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

తులసి ఆకు కషాయం.. ఒక గిన్నెలో గుప్పెడు తులసి ఆకులు తీసుకుని ఒక లీటర్ నీరు వేసి మరిగించాలి. బాగా మరిగిన తర్వాత వడకట్టి నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

* కడుపు ఉబ్బరం,అసిడిటీ సమస్య ఉన్నవారు ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున 2-3 తులసి ఆకులతో నిమ్మరసం కలిపి త్రాగటం వలన జీర్ణ సంబంధిత రోగాలకు మంచి ఉపశమనం కలుగుతుంది.

* తులసి ఆకు టీ.. సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటిని నయం చేయడంలో సహాయపడుతుంది.వర్షాకాలంలో చాలా మంది, ముఖ్యంగా జలుబు, గొంతు నొప్పితో బాధపడుతుంటారు.అలాంటి వారు ఉదయం నిద్రలేవగానే తులసి కషాయం తాగడం వల్ల తొందరగా ఉపశమనం కలుగుతుంది.అలాగే వేడి వేడిగా ఏదైనా తాగాలని అనిపిస్తే తులసి కషాయం తయారు చేసి త్రాగటం వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిది.

Health Benefits of Basil infusion
Health Benefits of Basil infusion

చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.. షుగర్ తో బాధపడేవారికి తులసి కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తులసి నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఇమ్యూనిటీ పవర్.. రోజూ తులసి కషాయం తాగడం వల్ల శరీరంలోని చెడు టాక్సిన్స్ బయటకు పంపి రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఇందులో ఉంటాయి. మన శరీరాన్ని లోపలి నుంచి శుభ్రంగా ఉంచుకోవాలంటే రోజూ పరగడుపునే తులసి కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది.

పొట్ట సమస్యలు.. తులసి కషాయం రోజూ తాగడం వల్ల జీర్ణ సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. ప్రధానంగా తులసి నీటిని తాగడం వల్ల మలబద్ధకం, విరేచనాలు, నులిపురుగుల సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా జీర్ణశయం
పనితీరు మెరుగవతుంది.

హార్మోనల్ ఇంబ్యాలెన్స్.. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడవారు హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ తో బాధపడుతున్నారు. అలాంటి వారికి ఎక్కువ రక్తస్త్రావంతో ఇబ్బందిపడుతుంటారు.వారికి తులసి ఆకు కషాయం మంచి విరుగుడు అని చెప్పొచ్చు. రోజూ ప్రొద్దున, సాయంత్రం కాఫీ, టీ బదులుగా ఈ కషాయం తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.

Advertisement