Pawan Kalyan : ఈ విషయం తెలిస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా “అయ్యో పాపం హరీష్ శంకర్” అంటారు..!

Pawan Kalyan : డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు.. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు.. హరి శంకర్ డైరెక్ట్ చేసిన సినిమా డిజాస్టర్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో ఎలాంటి ప్రశ్నలకైనా ధైర్యంగా, అగ్రెసివ్ గా ఎదుర్కొనే వ్యక్తి..‌ అలాంటి హరీష్ శంకర్ పైన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అయ్యో పాపం అనే పరిస్థితి నెలకొంది..! దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి మన పెద్దలు చెప్పే సామెత.. ఇది ఇండస్ట్రీకి ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి.. ఎందుకంటే ఒక ప్లాప్ సినిమా తీసిన ఆ డైరెక్టర్ ని మళ్ళీ సినీ జనాలు పట్టించుకోరు. కాబట్టి క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని అందరి డైరెక్టర్లు చూస్తారు.

కానీ హరీష్ శంకర్ డైరెక్టర్ ‘గద్దల కొండ గణేష్’ సినిమాతో ఇండస్ట్రీ మంచి హిట్ ఇచ్చారు.. ఆ తరువాత తను మూడేళ్లు పాటుగా ఖాళీగా ఉండటం అనేది ఆశ్చర్యకరం. అయినా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అవకాశాన్ని హరిశంకర్ దక్కించుకోవడం.. మళ్లీ సినిమా చేసే అవకాశం దక్కించుకోవడం వరమో, శాపమో అర్థం కాని స్థితిలో ఉన్నాడతను.. రెండేళ్ల క్రితం పవర్ స్టార్ కోసం ఒక కథను రెడీ చేసుకుని ఎదురుచూసి చూసి అలిసిపోయాడు. అదిగో ఇదిగో అంటూ సినిమా వెనక్కి వెళ్తూనే ఉంది. సోషల్ మీడియాలో పబ్లిక్ ఈవెంట్స్ లో ఎక్కడికి వెళ్లినా హరీష్ ని పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు అని అభిమానులు అడుగుతూనే ఉన్నారు..

Harish Shankar Pawan Kalyan movie worrest situation
Harish Shankar Pawan Kalyan movie worrest situation

హరి శంకర్ చాలా ఓపికగా బదులు ఇవ్వడం లేదా ఫ్యాన్స్ సంబరపడే మాటలు చెప్పటం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.. కానీ సినిమా కార్యరూపన దాల్చేది ఎప్పుడు అని అభిమానులు అడుగుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని ఒక వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. హరీష్ శంకర్ ని ట్యాగ్ చేసి.. పవన్ కళ్యాణ్ ని మళ్ళీ ఈ రేంజ్ లో చూడాలనీ ఉంది.. అది హరీష్ శంకర్ డైరెక్టర్ వల్లనే అవుతుంది ట్యాగ్ చేశాడు. ఈ వీడియోకి ప్రతిస్పందనగా హరి శంకర్ ఈసారి పవన్ కళ్యాణ్ ను నా సినిమాలో అంతకంటే ఎక్కువగా చూపిస్తాను.. ఫుల్ మీల్స్ ఇస్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్ కోసం ఇంతగా ఎదురు చూస్తున్నా హరీష్ శంకర్ ని చూస్తుంటే పవన్ అభిమానులు కూడా అయ్యో పాపం అని అనాల్సిన పరిస్థితి వచ్చింది..

Advertisement