Social Media :సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి చేరువలో ఉంది దాంతో మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి మహారాష్ట్ర కూలీల ఓ వింత కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఓ వ్యక్తి 12 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు..

ఓ వ్యక్తి పూనేలోని హింజే వాడి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం తన ఫోన్ కి మెసేజ్ ద్వారా లింకు వచ్చిందని ఆ వీడియో లింక్ పై క్లిక్ చేయాలని ప్రతి లైకు 50 రూపాయలు వస్తుందని అతను చెప్పారు. అలా ప్రతి ఒక్క లైక్ 50 రూపాయలు వస్తుందని ఆశతో ఎక్కువ డబ్బులు సంపాదించాలని.. వాళ్లు చూపించిన ఓ ఇన్వెస్ట్మెంట్ పథకంలోకి కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు రావడంతో అత్యాశపడి తన డబ్బులు పోగొట్టుకున్నాడు.
బాధితుడు లింక్‌పై క్లిక్ చేసి తనే స్వయంగా వివరాలు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అప్పుడు అతనికి 3 వీడియో క్లిప్‌లు పంపారు. వీడియో నచ్చడంతో అగంతకులు తన బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేశారని బాధితుడు పోలీసులకు వివరించాడు.
దాంతో డబ్బులు ఇన్వెష్ట్ చేస్తే డబ్బులు వస్తాయని ఒక పెట్టుబడి పథకం గురించి చెప్పారు. అంతే కాదు బోనస్ ఇస్తానని చెప్పి దుండగులు మోసం చేశారు. ముందుగా బాధితుడు రూ.1000 పెట్టుబడి పెట్టగా.. దానికి బదులుగా అతనికి రూ.9 వేలు వచ్చినట్లు.. దాంతో ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ ఆదాయం వస్తుందని అనుకుని. తన బ్యాంకు ఖాతాల నుంచి రూ.12.24 లక్షలను బదిలీ చేశాడు బాధితుడు.. మరుసటి రోజు బోనస్ కోసం ఎదురు చూసాడు..
బోనస్ రాకపోవడంతో పెట్టుబడిదారులకు ఫోన్ చేశాడు. వారి నుంచి సమాధానం లేకపోవడంతో దుండగులు మునుపటి లింక్ అన్ని కూడా తొలగించారు. మోసాన్ని గుర్తించిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు పై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇలాంటి మెసేజ్ లు ఫేస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ఎలా వచ్చినా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డబ్బులకు ఆశపడి పెట్టుబడి పెడితే మీ డబ్బులే కా చేస్తున్నారంటూ పోలీసులు సూచిస్తున్నారు . ఆన్లైన్ మోసాలకు దూరంగా ఉండండి అంటూ అవగాహన కల్పిస్తున్నారు.