Prabhas : టాలీవుడ్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా ప్రస్తుతం మంచి క్రేజ్ అందుకున్న ప్రభాస్ పెళ్లి విషయం గత కొద్ది రోజులుగా మీడియాలో నానుతూనే ఉంది. ఆయన ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని, ఈ హీరోయిన్ని పెళ్లి చేసుకోబోతున్నాడని అనేక రకాలుగా ప్రచారం అయితే నడుస్తుంది. బాలీవుడ్ మీడియాలోనే కాకుండా టాలీవుడ్ మీడియాలో కూడా ప్రభాస్ పెళ్లికి సంబంధించి పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల ప్రభాస్- కృతి సనన్ మ్యారేజ్ గురించి ఎక్కువగా వార్తలు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ‘ఆదిపురుష్’ చిత్రంలో ఇద్దరూ జంటగా నటించగా, ఈ సినిమా షూటింగ్ లోనే ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందని చెప్పుకొస్తున్నారు.

మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
తాజాగా ఈ అంశంపై కృతి సనన్ స్పందించింది. ఒకవేళ ఛాన్స్ వస్తే ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్న ఎదురు కాగా, అవును అని కృతి చెప్పింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక కృతి సనన్ ఇప్పుడు వరుణ్ ధావన్ భేడియా (తెలుగులో తోడేలు) అనే సినిమాలో నటించగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో పరోక్షంగా ప్రభాస్ మీద చర్చలు నడుస్తూనే ఉన్నాయి.. కృతిని ఏడిపించేందుకు వరుణ్ ధావన్ పదే పదే పరోక్షంగా ప్రభాస్ పేరు తీస్తున్నాడా? లేదా నిజంగానే ఈ ఇద్దరి మధ్య ఏమైనా ఉందా? అనే విషయంపై క్లారిటీ రావడం లేదు.
తాజాగా వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. కృతి మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు ముంబైలో లేడు.. ప్రస్తుతం దీపికతో కలిసి షూటింగ్ చేస్తున్నాడు అంటూపలు హింట్స్ ఇస్తున్నాడు వరుణ్ ధావన్. మరి ఆయన చెప్పిన దానిలో ఎంత నిజం ఉందనేది రానున్న రోజులలో తెలియనుంది. మరోవైపు, అనుష్క శెట్టి, ప్రభాస్ లు పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా కాలంపాటు గతంలో వార్తలు సోషల్ మీడియాలో సంగతి తెలిసిందే. అయితే, తమ మధ్య అలాంటిదేమీ లేదని ప్రభాస్, అనుష్క ఇద్దరూ స్పష్టం చేసిన అప్పుడప్పుడు ఆ ప్రచారం నడుస్తూనే ఉంది. కాని ఇటీవల మాత్రం ప్రభాస్, కృతిల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.