Goutham : గౌతమ్ ఘట్టమనేని తోపుగాడు రా .. తాతయ్య కోసం మహేశ్ కూడా చేయలేనిది చేస్తున్నాడు

Goutham: కృష్ణ మరణంతో ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ అంతా శోక‌సంద్రంలో మునిగిన విష‌యం తెలిసిందే. కృష్ణ‌ తనయుడు మహేష్ బాబు , మ‌న‌వ‌డు గౌతమ్, మ‌న‌వ‌రాలు సితార.. సూప‌ర్ స్టార్ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరయ్యారు. రీసెంట్‌గా కృష్ణ మరణంపై మ‌హేష్ బ‌బు రియాక్ట్ అవుతూ త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఎమోషనల్ లెటర్ రాశారు నీ పుట్టుకనే ఓ సెలబ్రేషన్.. మమ్మల్ని వదిలిన నీ ప్రయాణం అంతకంటే ఎక్కువ సెలబ్రేట్ అవుతుంది నాన్న‌. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపి వెళ్లారు. డేరింగ్ అండ్ డాషింగ్ అనేది మీ నైజం కాగా, మీరే నా స్ఫూర్తి అని త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు మహేష్ బాబు.

Advertisement
goutham-does-for-his-grand-father
goutham-does-for-his-grand-father

గుడ్ గౌత‌మ్…

త‌న తండ్రికి సంబంధించిన కార్య‌క్ర‌మాలన్నింటిని పూర్తి చేసిన మ‌హేష్ బాబు త్వ‌ర‌లో తండ్రికి సంబంధించి మెమోరియ‌ల్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ప్ర‌య‌త్నాలు కూడా మొద‌లు పెట్టాడ‌ట‌. మ‌రోవైపు మ‌హేష్ పిల్లలు కూడా తమ తాత జ్ఞాప‌కంగా ఏదో ఒక‌టి చేయాల‌ని అనుకుంటున్నారు. సితార అనాథ పిల్ల‌ల‌కు వారంలో ఒక రోజు అన్న‌దానం చేయాల‌ని డిసైడ్ కాగా, ఇప్పుడు గౌత‌మ్ ఘ‌ట్ట‌మనేని కూడా ఓ సెన్సేష‌న‌ల్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. కృష్ణ చ‌దువుకున్న కాలేజ్ డెవ‌లప్ చేసే ఆలోచ‌న చేస్తున్నాడ‌ట‌. త‌న ద‌గ్గ‌ర కొంత మొత్తం ఉండ‌గా, తండ్రి ద‌గ్గర నుండి కొంత తీసుకొని కాలేజ్ డెవ‌ల‌ప్ చేసే ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

Advertisement

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ చాలా పెద్దది కాగా, ఆయనకి అయిదుగురు పిల్లలు. పలు దేశాల్లో ఈ కుటుంబానికి చెందిన వారుసెటిల్ అయ్యారు. . కొన్ని నెలల క్రితమే ఉన్నత చదువుల నిమిత్తం గౌతమ్ విదేశాలకు వెళ్ల‌గా, నాన్న‌మ్మ చ‌నిపోయిన‌ప్ప‌డు రాలేక‌పోయిన‌ట్టు స‌మాచారం. నానమ్మ మృత దేహం వద్ద సితార మాత్రమే కనిపించింది. తాత‌య్య చ‌నిపొయిన‌ప్పుడు మాత్రం గౌత‌మ్ ఇండియాకి వ‌చ్చి తాత‌య్య భౌతిక కాయానికి నివాళులు అర్పించాడు. కాగా నానమ్మ ఇందిరా దేవి, తాత‌య్య కృష్ణ‌ల‌తో గౌతమ్, సితారకు మంచి బాండింగ్ ఉంది. సెలవులు వచ్చిన ప్రతి సారి పిల్లలిద్దరూ తాత‌య్య‌ దగ్గరకు తీసుకెళ్లేవారు మహేష్ బాబు.

Advertisement