God Father Movie : గాడ్ ఫాదర్ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది — ఈ ఒక్క దెబ్బతో సినిమా హిట్, ఫ్లాప్ చెప్పేయచ్చు.!

God Father Movie : ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న లేటెస్ట్ చిత్రం గాడ్ ఫాదర్.. ఇది మలయాళం లో రూపొందిన లూసిఫర్ కి రీమేక్.. అక్కడ మోహన్ లాల్ నటించారు.. ఈ రీమేక్ కి మోహన్ రాజా దర్శకత్వం వహించారు.. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలకపాత్ర పోషించారు.. రేపు బాక్సాఫీస్ బరిలో గాడ్ ఫాదర్ నిలవనుంది.. మెగాస్టార్ చిరంజీవితో పోటీ పడటానికి నాగార్జున కూడా రేపు తన ది ఘోస్ట్ సినిమాను విడుదల చేస్తున్నారు. టాలీవుడ్లో ఇద్దరు కీలక హీరోల నుంచి ఒకే రోజు సినిమా విడుదల కావడంతో.. ఏ సినిమా హిట్ అవుతుందా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు..! మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా హిట్ అవుతుందా లేదా ప్లాప్ అవుతుందా అని చెప్పే సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది..!

god-father-movie Censor report of Godfather has arrived
god-father-movie Censor report of Godfather has arrived

గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఒరిజినల్ లో ఉన్న సీన్స్ కొన్ని మార్పులతో హీరో ఫ్లాష్ బ్యాక్ ని కొంచెం వివరిస్తూ గాడ్ ఫాదర్ ని తెరకెక్కించారు.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోయిన తరువాత ఆ సీటు కోసం పార్టీ వాళ్లు, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు.. వాటిని ఆ పార్టీకి షాడోలా ఉండే హీరో ఎలా ఎదిరించి నిలబడ్డాడు అనే.. కాన్సెప్ట్ తో వచ్చిన గాడ్ ఫాదర్ ఒరిజినల్ మెయిన్ స్టోరీని అలాగే తీసుకున్నా.. కొన్ని హీరోయిజం ఎలివేటెడ్ సీన్స్ యాడ్ చేశారట.. సల్మాన్ ఖాన్ కి చిరంజీవికి మధ్య వచ్చే సీన్స్ అందరిని మెప్పిస్తాయట.. నయనతార చిరంజీవి సత్యదేవ్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తాయని.. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుందని.. సెకండ్ ఆఫ్ కాస్త అలా అలా ఉన్నా కానీ.. చివరి 20 నిమిషాలు మాత్రం సీట్ల నుంచి కదలనివ్వకుండా చేస్తుందని.. క్లైమాక్స్ మాత్రం చిరంజీవి నటనతో కచ్చితంగా ప్రతి ఒక్కరిని మెప్పిస్తాడని తెలుస్తోంది.. మొత్తానికి సెన్సార్ రిపోర్టు ప్రకారం ఈ సినిమా హిట్ టాక్ వచ్చేసింది..

ఎంత చిరంజీవి చేసినా రీమేక్‌ రీమేక్‌ అన్నట్టుగానే చూస్తారు. అదే సమయంలో ఇటీవల హిందీలో విడుదలైన విక్రమ్‌వేద తమిళం చిత్రానికి రీమేక్‌. ఒకసారి ఆ సినిమాని ప్రేక్షకులు చూసేయడంతో ఇప్పుడు సైఫ్‌ అలీ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ కలిసి చేసిన ఈ చిత్రానికి మంచి టాక్‌ ఉన్నా, థియేటర్లలో కలెక్షన్లలో లేవు. మరి అదే పరిస్థితి ఇప్పుడు గాడ్‌ ఫాదర్‌ ఫేస్‌ చేయబోతుందా అనే సందేహాలున్నాయి. మరి చిరంజీవి హిట్ కొడతాడా? అనేది చూడాలి. హిట్‌ కొడితే మాత్రం సంచలనమనే చెప్పొచ్చు..