God Father 1st Day Collections : గాడ్ ఫాదర్ మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే.!?

God Father 1st Day Collections : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం గాడ్ ఫాదర్ నిన్ననే థియేటర్లకు వచ్చింది..! చిరంజీవి సినిమా అంటేనే పాటలకు, డాన్స్ లకు పెట్టింది పేరు..! అభిమానుల్లో వాటిపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..! అయితే చిరంజీవి ఈ సినిమాతో తన మార్క్ ను మరోసారి చూపించారు..!! ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది..!! మొత్తానికి గాడ్ ఫాదర్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఎంత మేరకు కలెక్షన్లు వసూలు చేసిందంటే.!?

గాడ్ ఫాదర్ సినిమా తొలి రోజులో 38 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషం ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ.. అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.. గాడ్ ఫాదర్ సినిమా వరల్డ్ వైడ్ గా సుమారు 92 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్లు కాకుండా ఇంకా 74.92 కోట్ల రేంజ్ లో షేర్లు ఎందుకోవాల్సి ఉంది.. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అయితే ఉంది. సో లాంగ్ రన్ లో ఈ సినిమా జోరు చూపించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు..

God Father Movie First Day World wide Collections
God Father Movie First Day World wide Collections

మొదటిరోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లు ఒక్కసారి చూద్దాం..
నైజాం – 3.29 కోట్లు
సీడెడ్ – 3.18 కోట్లు
యు ఏ – 1.26 కోట్లు
ఈస్ట్ – 1.26 కోట్లు
వెస్ట్ – 59 లక్షలు
గుంటూరు – 1.75 కోట్లు
కృష్ణ – 73 లక్షలు
నెల్లూరు – 57 లక్షలు
ఆంధ్ర ప్రదేశ్ – తెలంగాణ మొత్తం- 12.29 కోట్లు (21.40 కోట్ల గ్రాస్) (1.28కోట్లు Hires)
KA -1.56 కోట్లు
OS -2.1 కోట్లు
Hindi + ROI – 45 లక్షలు
టోటల్ వరల్డ్ వైడ్ – 17.08 కోట్లు.. (31.08 కోట్ల గ్రాస్)

ఏరియా వైజ్ బిజినెస్ డీటెల్స్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో రూ. 22 కోట్లు షేర్ రాయలసీమ (సీడెడ్)లో రూ. 13.50.కోట్లు షేర్, ఆంధ్ర ప్రదేశ్ రూ. 35 కోట్లు.. కర్ణాటక + రెస్టాఫ్ భారత్ రూ. 6.50 కోట్లు.. ఓవర్సీస్ రూ. రూ. 7.5 కోట్లు.. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 91 కోట్లు బిజినెస్ చేసింది.
మెగాస్టార్ సినిమాకి ఇతర సినిమాల మాదిరిగా టికెట్స్ రేట్స్ హైట్ కూడా లేకపోవడం, ఇతర సినిమాలో మాదిరిగా హైర్స్ కూడా లేకపోవడం, అన్నీ కలిపి సినిమా ఓపెనింగ్స్ పై గట్టిగా చూపించుంది. దాంతో సినిమాపై ఓ రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకుంది అనుకుంటే.. మొత్తం మీద మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 31 కోట్ల లోపే ఓపెనింగ్స్ ను అందుకొని నిరాశపరిచింది.. కానీ ఇప్పుడు ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో ఇవి డీసెంట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి..

Image