Getup Srinu : గెటప్ శ్రీను కి దారుణమైన వెన్నుపోటు పొడిచిన సుడిగాలి సుధీర్ .. ??

Getup Srinu: గెట‌ప్ శ్రీను కామెడీ ఎంత వినోదం పంచుతుంతో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మెగాస్టార్ చిరంజీవి మేనరిజాన్ని అనుకరించే వారిలో గెటప్ శ్రీను ముందు వరుసలో ఉంటాడు అనే చెప్పాలి. చిరంజీవి నటించే సినిమాల్లోని మేనరిజాన్నే కాదు.. గెటప్‌ని కూడా అచ్చుగుద్దినట్లు గెటప్ శ్రీను దింపేస్తుంట‌డ‌డం మ‌నం చూశాం. రోజురోజుకి గెట‌ప్ శ్రీను త‌న క్రేజ్ పెంచుకుంటూ పోతున్నాడు. మెగాస్టార్‌తో కలిసి ప్రైవేట్ జెట్‌లో వెళ్లేంతలా చనువు కూడా సంపాదించగలిగాడు. శ్రీను కెరీర్ ఆరంభంలో మిమిక్రీ ఆర్టిస్టుగా పని చేసాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఈవెంట్లలో స్టార్లను ఇమిటేట్ చేస్తూ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు చేస్తున్నాడు.

getup-srinu-is-in-troubles-due-to-sensational-comments
getup-srinu-is-in-troubles-due-to-sensational-comments

భ‌లే హ్యాండ్ ఇచ్చాడుగా..

కమెడియన్ వేణు ద్వారా జబర్ధస్త్ షోలోకి అడుగుపెట్టి చాలా తక్కువ సమయంలోనే ఊహించని ఎత్తుకు ఎదిగాడు. మంచి పేరు, ప్రఖ్యాతలను అందుకున్నాడు. అంద‌రి మాదిరిగా కాకుండా త‌న‌కంటూ ప్ర‌త్యేక శైలి ఏర్ప‌ర‌చుకున్న గెట‌ప్ శీను స్కిట్ స్కిట్టుకూ వైవిధ్యాన్ని చూపించడ‌మే కాక‌, విభిన్నమైన శైలితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అందుకే శ్రీనుకు అంత మంచి పేరు వచ్చింది. సుడిగాలి సుధీర్, రామ్ ప్ర‌సాద్‌తో క‌లిసి గెట‌ప్ శీను చేసే సంద‌డి మాములుగా ఉండ‌దు. మ‌నోడు రీసెంట్‌గా వివాదంలో ఇరుక్కున్నాడు. హనుమాన్ టీజర్ కార్య‌క్ర‌మంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ను ఓ రేంజ్ లో పొగిడేస్తూ… మాటల మధ్యలో ఇండస్ట్రీకి మరో రాజమౌళి అంటూ పొగ‌డ్త‌లు కురిపిస్తారు.

అయితే ప్ర‌శాంత్‌ని రాజ‌మౌళితో పోల్చ‌డంతో కొంద‌రు ఫ్యాన్స్ చాలా హ‌ర్ట్ అవుతూ.. గెట‌ప్ శీనుని ఏకిపారేశారు. ప్ర‌శాంత్ వ‌ర్మ‌కి రాజ‌మౌళికి తేడా లేదా అంటూ తిట్టిపోస్తున్నారు. గెట‌ప్ శీనుని ఇంత తిడుతున్నా కూడా ఆయ‌న ఫ్రెండ్ సుడిగాలి సుధీర్ ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు. కొంద‌రు నెటిజ‌న్స్.. ఇదేనా ఫ్రెండ్షిప్ , గెట‌ప్ శీను క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు క‌నీసం ఏదొక‌టి అయితే స్పందించి ఆయ‌న‌కు అండ‌గా ఉండాలి అంటూ సుధీర్‌ని తిట్టి పోస్తున్నారు. ఫ్రెండ్‌కి వెన్నుపోటు పొడిచావు అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.