Geetu Royal : నువ్వు షోలో వద్దు బయటకి వచ్చేయ్ ” గీతూ మీద సీరియస్ అవుతోన్న ఆమె ఫ్యామిలీ ?

Geetu Royal : బిగ్ బాస్ బర్త్ డే స్పెషల్ గా హౌస్ మేట్స్ అంతా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయాలని ప్లాన్ చేశారు. ఆర్జే సూర్య తన మిమిక్రీతో డిఫరెంట్ కామెడీని ప్రజంట్ చేశారు. నెక్ట్స్ శ్రీసత్య, శ్రీహాన్ ల హాట్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో అర్జున్ కు మండేలా చేసినట్లు స్పష్టం అవుతుంది. నెక్ట్స్ ఫైమా కామెడీ స్కిట్ చేసింది. కీర్తీ భట్ తో కలిసి మంచి ఎంటర్ టైన్ మెంట్ అందించింది. నెక్ట్స్ బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లోకి గీతూకి ఎంట్రీ దొరికింది.

చికెన్ తినడానికి అర్హత లభించాలంటే ఇంటి సభ్యుల గురించి ఏదైనా గాసిప్ చెప్పాలని బిగ్ బాస్ అనడంతో సూర్య, ఇనయాకు మధ్యలో ఏదో రగులుతుంది మొగలిపొద అనిపిస్తుందని కామెంట్ చేయడంతో బిగ్ బాస్ స్టైల్ లో అందుకు తగిన కౌంటర్ ఇచ్చాడు. ఈ గాసిప్ తో చికెన్ ను జస్ట్ స్మెల్ చేయోచ్చని బిగ్ బాస్ చెప్తాడు. బిగ్ బాస్ ఇచ్చిన పంచులకి గీతూ నవ్వింది. ఏంటి బిగ్ బాస్ ఇంత కామెడీ అయిపోయావ్ అంటూ గీతూ కామెంట్ చేసింది. ఇక బాలాదిత్య అన్న దీపు దీపు అంటా ఉంటే నాకు మండుతాది అనగానే బిగ్ బాస్ మరి అంత మంటతో ఈ స్పైసీ చికెన్ తింటావా అనగానే గీతూ నవ్వింది.

Geetu Royal family serious on her
Geetu Royal family serious on her

Geetu Royal : హౌస్ లో బెస్ట్ గాసిప్ ఇదే!

ఇదిలా ఉండగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో బిగ్ బాస్ పై రకరకాల గాసిప్ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గీతూపై వస్తున్న కామెంట్స్ విషయంలో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. అందుకే నువ్వు బిగ్ బాస్ షోలో ఉండటానికి వీల్లేదని, వెంటనే బయటకు వచ్చేయాలని, గీతూ మీద వాళ్ల ఫ్యామిలీ సీరియస్ అవుతుంది. అయితే ఇలా అవ్వడానికి హౌస్ లో ఆమె బిహేవియర్ అంటున్నారు నెటిజన్లు