గుజరాత్ లోని గంగుబాయ్ కతియావాడీ వాళ్లది లాయర్ల కుటుంబం. గంగుబాయి చిన్న వయసు నుంచే సినిమాలంటే పిచ్చి. అంతేకాదు వాళ్ల నాన్న దగ్గర క్లర్క్‌గా పని చేసే అతనితో ప్రేమలో కూడా పడింది. ఇద్దరూ కలిసి ముంబై పారిపోయారు. అప్పుడే అతను గంగుబాయ్ 500 తీసుకుని రమన్ని చెబుతాడు. కొన్నాళ్ళు అతను గంగుబాయ్ తో ఎంజాయ్ చేసి.. ఆ తరువాత గుంగుబాయిని కామాటిపురాలోని ఒక వేశ్యాగృహంలో 500 రూపాయలకు అమ్మేసి పారిపోయాడు. అక్కడి నుంచే గంగుబాయి జీవితం అనూహ్యమవుతూ వచ్చింది.
వేశ్యావాటికలో గంగుబాయి వారాల తరబడి ఏడ్చింది. కాని ఆ పాడు పనికి గంగుబాయ్ అంగీకరించక తప్పలేదు. కానీ ఆమె రూపం, కొద్దో గొప్పో ఉన్న చదువు ఆమెను హైక్లాస్ క్లయింట్‌ల దగ్గరకు వెళ్లే వేశ్యను చేయగలిగాయి. సహజంగా నేరగాళ్లు కూడా చాలామంది వచ్చి పోతూ ఉండేవారు. అలా ఆమెకు ముంబై అండర్‌వరల్డ్ తెలిసింది. ఆ సమయంలోనే పెద్ద డాన్ అయిన కరీం లాలాకు చెందిన ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు.
తనకు న్యాయం జరగాలని ఆశించి శుక్రవారం నమాజు ముగించుకుని వస్తున్న కరీం లాలాను కలిసింది. తనకు జరిగిన అన్యాయం, తాను అనుభవిస్తున్న వేదన చెప్పుకుని.. కరీం లాలా వెంటనే ఆమెకు ఊరడింపు ఇచ్చాడు. ఆమె రాఖీ కడితే కట్టించుకుని రక్ష ఇచ్చాడు. కామాటిపురాలో గుంగుబాయికి ఎటువంటి కష్టం ఎవరు కలిగించినా వారి పని చూస్తా అని హెచ్చరించాడు. కామాటిపురాలో తానే వేశ్యాగృహాల యజమానిగా ఎదగడం మొదలెట్టింది.
కామాటిపురాలో గంగుబాయికి అనేక వేశ్యాగృహాలు సొంతమయ్యాయి. ఆమె కట్టే ఖరీదైన చీరలు నాడు విశేషమయ్యాయి. నిజం బంగారు అంచు ఉండే చీరలు, నిజం బంగారు గుండీలు ఉండే జాకెట్లు ఆమె కట్టుకునేది. అప్పట్లోనే ఆమెకు బెంజ్ కారు ఉండేది. అండర్ వరల్డ్ కూడా ఆమె గుప్పిట్లో ఉండేది. ఆమె బలవంతపు వ్యభిచారాన్ని ప్రోత్సహించలేదు. వృత్తిగా స్వీకరించడానికి ఇష్టపడేవాళ్లే ఉండాలని తెలిపింది. ఎవరైనా ఈ కూపం నుంచి బయటపడాలనుకుంటే వారికి వెళ్ళే స్వేచ్ఛ ను ఇచ్చింది. వేశ్యల బాగోగులతోబాటు, వారికి పుట్టిన బిడ్డల బాగోగులు కూడా ఆమె చూసేది. అందువల్లే ఆమె విగ్రహం కామాటిపురాలో ఉంది. ఆమె ఫొటోలు నేటికి కామాటిపురాలోని వేశ్యాగృహాల్లో ఇప్పటికీ దర్శనమిస్తాయి.