Avatar 2 : యంగ్ హీరోగా ప్రముఖ రచయితగా , దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని భారీ విజయాలను సొంతం చేసుకున్న అవసరాల శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకసారి మనసుపెట్టి కలం పట్టాడంటే కచ్చితంగా ఆ సినిమా డైలాగ్స్ వేరే లెవెల్ అన్నట్లుగా ఇప్పటికే ఈయన సినిమాల ద్వారా మనకు స్పష్టం అవుతుంది. ఈ క్రమం లోనే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షక లోకం ఎంతగానో ఎదురు చూస్తున్న అవతార్ 2 సినిమా కోసం అవసరాల శ్రీనివాస్ డైలాగ్స్ రాసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే.. దాదాపు రూ.1600 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16వ తేదీన రిలీజ్ చేయాలని డిస్నీ వారు గట్టిగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదులకోట్ల సంఖ్యలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తెలుగులో మరింత పాపులారిటీని దక్కించుకోవడానికి ఒక మంచి రచయిత అయితే బాగుంటుందని ఆలోచించి అవసరాల శ్రీనివాస్ కు డైలాగ్స్ రాసే అవకాశం అందించారట. నిజంగా ఇది ఆయనకు గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.
మొత్తానికైతే సన్నివేశాలకు తగ్గట్టుగా పాత్రల తీర్పు తగ్గట్టుగా ఆకట్టుకునే డైలాగ్స్ ఉండడం కోసం అవసరాల శ్రీనివాస్ చాలా గొప్పగా ఆలోచించి తన కలం కు పదును పెట్టి మరీ ఈ సినిమా కోసం డైలాగ్స్ రాశాడట.ఇది వింటుంటే థియేటర్లలో ఈలల మోత మొగాల్సిందే అని స్పష్టం అవుతుంది.