Singer Sunitha : ఆ రహస్యాన్ని రివీల్ చేస్తూ ఫోటో షేర్ చేసిన సునీత..!

Singer Sunitha : టాలీవుడ్ సింగర్ సునీత గురించి.. ఆమె పాటల గురించి.. అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే మరొకవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు తెచ్చుకోండి. గులాబి, ఎగిరే పావురమా వంటి సినిమాలలో తొలిసారి పాటలు పాడి మంచి సక్సెస్ అందుకున్న సునీత బుల్లితెర పై కూడా పలు షోలు చేసి మరింత ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రెండవ వివాహం తర్వాత సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Finally Sunitha reveals that matter to share that photo..!
Finally Sunitha reveals that matter to share that photo..!

నిత్యం తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూనే తాజాగా ఇన్ స్టాలో కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో తాను మైకు పట్టుకుని పాడుతున్నట్లుగా కనిపించింది. ఇక తన ఎనర్జీ సీక్రెట్ గురించి ఒక విషయాన్ని తెలిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకు ఆ ఎనర్జీ సీక్రెట్ ఏమిటంటే.. తాను పాటలు పాడడమే తన ఎనర్జీ సీక్రెట్ అని తెలిపింది. తనకు ఎప్పుడు స్ట్రెస్ గా అనిపించినా సరే మైకు పట్టుకుని పాటలు పాడేస్తూ ఉంటుందట సునీత. ప్రపంచంలో తనకు ఎక్కడ దొరకని ప్రశాంతత, ఎనర్జీ పాటలు పాడడంలోనే లభిస్తుంది అంటూ అసలు రహస్యాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసుకున్న ఈ ఫోటోలు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి.

మరి సునీత ఇంత ఎనర్జీగా ఉండడానికి పాటలే కారణమని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఒక మనిషి ఉత్సాహంగా , ఉల్లాసంగా ఉండడానికి పాటలు ఎంతగా తోడ్పడుతాయో ఈమెను చూస్తే అర్థమవుతుందంటూ రకరకాలుగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.. సింగర్ సునీత ప్రస్తుతం ఒకవైపు సింగర్ గా .. మరొకవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా.. ఇంకొక వైపు పలుషోలకు జడ్జిగా వ్యవహరిస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంటుంది. ఏది ఏమైనా ఈమె టాలెంట్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే.