Aadipurush Teaser : మరికొన్ని గంటల్లో ఆదిపురుష్ టీజర్ రిలీజ్ – ఈలోగా ప్రభాస్ కి దిమ్మతిరిగే మ్యాటర్ తెలిసింది.!

Aadipurush Teaser : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఆదిపురుష్.. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది..! ఈ రోజు సాయంత్రం 7:11 నిమిషాలకు ఆదిపురుష్ అఫీషియల్ టీజర్ ని ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో గల సరయు బ్యాంకు ఆవరణలో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.. ఇప్పటికే ఈవెంట్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. మరికొన్ని గంటల్లో ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆదిపురుష్ టీజర్ విడుదల కానుంది.. అయితే ఈలోపు ప్రభాస్ కి దిమ్మ తిరిగిపోయే న్యూస్ తెలిసినట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది..!!

few hours left to release aadipurush teaser
few hours left to release aadipurush teaser

ఈ సినిమా రామాయణ మహాకావ్యం నేపథ్యంలో తెరకెక్కుతుంది.. అయితే ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే.. మోడీ కి భక్తి ఎక్కువ.. అందుకే రామాయణ కావ్యం లాంటి ఆదిపురుష్ సినిమా కావడంతో టీజర్ విడుదల కానుంది అని తెలుసుకున్న మోడీ ఈ టీజర్ చూడాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.. ఈ విషయాన్ని ప్రభాస్ కు మోడీ పర్సనల్ సెక్రెటరీ తెలియజేసినట్లు సమాచారం.. ఎంతోమంది ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.. అయితే అలాంటి మోడీనే ప్రభాస్ టీజర్ కోసం ఎదురుచూస్తున్నాడని తెలిసినా ప్రభాస్ హ్యాపీగా ఫీల్ అయ్యాడట.. త్వరగా ఈ టీజర్ రిలీజ్ చేయాలని ప్రభాస్ అనుకుంటున్నారట.. ఈ న్యూస్ తెలిసిన ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి గా ఉన్నారు. అయితే కొంతమందిని నెటిజన్స్ మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టు పారేస్తున్నారు.

మరి కొంతమంది ఇందులో నిజం ఉంది.. ఎందుకంటే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బిజెపిలో కీలక పదవుల్ని అధిరోహించారు.. ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి ఎవరో ఒకరు బీజేపీ లోకి రావాలని కొన్ని రోజుల నుంచి బిజెపి పెద్దలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ ను బుట్టలో వేసుకోవడానికి మోడీ ఈ ఒక్క మాటతో ప్రభాస్ ను తన వైపు తిప్పుకోవడానికి ప్లాన్ చేశారని.. అలాగే ప్రభాస్ బీజేపీ కి సపోర్ట్ చేయడానికి ఒక ఎత్తుగడ అని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయం.. ఏది ఏమైనా కానీ.. ప్రభాస్ ఆది పురుష టీజర్ కోసం ప్రధానమంత్రి మోడీ వెయిట్ చేయడం నిజంగానే బిగ్ న్యూస్.. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు.‌. భారీ బడ్జెట్ తో ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై చూడనటువంటి అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో కృతి సనన్, బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు..