Mahesh Babu : కూతురి పాలిట‌ మ‌హేష్ బాబు విల‌న్‌గా మారాడా.. ఎందుకంత రిస్క్‌లో పెడుతున్నాడు..!

Mahesh Babu : త‌న తండ్రి కృష్ణ న‌ట‌వార‌సుడిగా సినిమా పరిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన మ‌హేష్ బాబు ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా మారాడు. ప్ర‌స్తుతం మ‌హేష్ బ్రేకుల్లేకుండా సినిమాలు చేస్తుండ‌గా, ఆ సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా మారుతున్నాయి. రీసెంట్‌గా స‌ర్కారు వారి పాట సినిమాతో భారీ హిట్ కొట్టిన మ‌హేష్ ఇప్పుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన త‌ర్వాత రాజ‌మౌళితో చేయ‌నున్నాడు. ఈ సినిమా హాలీవుడ్‌ని మంచి ఉండ‌నుంది. తాజాగా సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు.. హాలీవుడ్ ఏజెన్సీ సీఏఏతో రాజ‌మౌళి డీల్ చేసుకున్నార‌ట‌.

ఈ డీల్ వ‌ల్ల మ‌హేష్ సినిమాను ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌లో తీసుకెళ్లే మార్గం మ‌రింత సులువుగా మారుతుంద‌ని అంటున్నారు. ఇకపోతే మహేష్ బాబు పిల్లలు గౌతమ్, సితార గురించి అందరికీ తెలిసిందే. గౌతమ్ వ‌న్ నేనొక్క‌డినే చిత్రంలో న‌టించ‌గా, ఆ త‌ర్వ‌తా మ‌ళ్లీ సినిమాలు చేయ‌లేదు. ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టడంతో పెద్దగా సినిమాల గురించి ఏమాత్రం ఆలోచించలేదు కానీ సితార మాత్రం ఒక వైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ప్రస్తుతం తన తండ్రితో కలిసి జీ తెలుగు ఛానల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

fans fire on Mahesh Babu
fans fire on Mahesh Babu

Mahesh Babu : ఏంద‌య్యా మ‌హేషా..

మహేష్ బాబు జీ తెలుగు ఛానల్ తో 9 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకొని ఈ చానల్లో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మ‌హేష్ బాబు రేంజ్‌కి తనతో పాటు సితారని కూడా ఈ ఛానల్ ప్రమోషన్ కోసం ఉపయోగించుకోవడంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చూస్తుంటే సితార కెరియ‌ర్‌ని మ‌హేష్ రిస్క్‌లో పెడుతున్నాడా అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. సితారలో దాగి ఉన్న టాలెంట్ చూస్తే ఆమె ఖచ్చితంగా గొప్ప నటి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆమె టాలెంట్‌ని చిన్న చిన్న వాటికి ఉప‌యోగించొద్దు అని కామెంట్స్ చేస్తున్నారు. సితార ఇటీవ‌ల స‌ర్కారు వారి పాట మూవీ ప్ర‌మోష‌న్ లో మెరిసి సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే.