Heroine : ఈడి అధికారులు తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ కు నోటీసులు జారీ చేశారు. ఈనెల 19వ తేదీన ఈడీ విచారణకు హాజరు కావాలని కూడా తెలిపారు. అసలు విషయంలోకి వెళితే టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు చాలామంది డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. అయితే సరైన ఆధారాలు లేక ఈడీ వారిని వదిలిపెట్టింది. కానీ తెలంగాణ పోలీసులు పూర్తిస్థాయిలో ఆధారాలు ఇవ్వలేదని కోర్టుకు వెళ్లి ఆధారాల కోసం న్యాయపోరాటం చేశారు ఈ డీ.. అధికారులు.. కానీ తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత తెలంగాణ పోలీసులు ఈడీ కి ఆధారాలు ఇచ్చారు.

అయితే కోర్టు కోసం సమర్పించని కీలకమైన వాంగ్మూలాలు, ఇతర డిజిటల్ ఆధారాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటిని పరిశీలించి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇంతవరకు విచారించిన వారికి ఈడి మళ్లీ ప్రత్యేకంగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీతిసింగ్ కూడా ఈడి నోటీసులు జారీ చేసింది. అయితే డ్రగ్స్ కోసం చెల్లింపులు చేశారన్న దానిపైన అక్రమ నగదు లావాదేవీలకు కోణంలో ఈ దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఈడి విచారణలో సెలబ్రిటీలు డ్రగ్స్ కొన్నట్లుగా బయటపడితే చిక్కులు తప్పవట. మరి ఆ గుట్టు విప్పడానికి రకుల్ ప్రీతిసింగ్ కు ఈడి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల 19వ తేదీ హాజరుకానున్న రకుల్ ప్రీతిసింగ్ కు ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి అన్నది ఇప్పుడు సందేహంగా మారింది.