Haniska: హీరోయిన్స్ అంటే కొందరికి ఎంత క్రష్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిని చూస్తూ కొందరు జీవితం గడిపేస్తుంటారు. కొందరైతే వారికి గుడులు కూడా కడతారు. అలా తన అభిమానులతో గుడులు కట్టించుకున్న హీరోయిన్ హన్సిక. 16 ఏళ్ల వయస్సులో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తన నటన, అందచందాలతో అలరించింది. అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశ ముదురులో హన్సిక కథానాయికగా నటించగా, ఈ సినిమా మంచి హిట్ కావడంతో తెలుగులో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా యంగ్ హీరోల సరసన సినిమాలు మెప్పించింది.

పెళ్లికి వేళాయే..
అయితే హన్సిక రీసెంట్గా తన పెళ్లికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేసింది. తన సోషల్ మీడియాలో భర్తకి సంబంధించి ఫొటోలు షేర్ చేస్తూ తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపింది. ఆమె వ్యాపారవేత్త సోహైల్ కథూరియాను పెళ్లి చేసుకోనుండగా, వీళ్ల పెళ్లి డిసెంబర్ 4న జరగనుంది. జైపూర్‌లోని ముండోతా ఫోర్ట్‌కు వీళ్ల పెళ్లికి వేదిక కానుందనే విషయం తెలిసిందే.ఇక పెళ్లికి 12 రోజుల ముందు నుంచే అంటే మంగళవారమే (నవంబర్ 22) పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ముంబైలో జరిగిన మాతా కీ చౌకీ ఉత్సవంతో వీళ్ల పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి.
ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ కాగా, త్వరలోనే పెళ్లి కూతురు కానున్న హన్సికలో ఇప్పుడే ఆ పెళ్లి కళ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే హన్సిక పెళ్లి చేసుకుంటుందని కొందరు సంతోషిస్తుంటే మరి కొందరు అభిమానుల మాత్రం వద్దు హన్సిక.. పెళ్లి చేసుకోవద్దు అని రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. ఎంతోమంది అభిమానులతో పాటు పలువురు హీరోలని సైతం తన అందంతో ఆకర్షించిన హన్సిక ఇప్పుడు పెళ్లి చేసుకుంటుందనే సరికి కొందరు చాలా హర్ట్ అవుతున్నారు. పొరపాటున కూడా చేసుకోవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే . డిసెంబర్ 2న సూఫీ నైట్, డిసెంబర్ 3న మెహందీ, సంగీత వేడుకలు జరగనుండగా, ఈ కార్యక్రమాల్ని ఓటీటీలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.