NTR : ఎన్టీఆర్ తొలి పారితోషికం ఎంత.. ఏం చేశారో తెలుసా..?

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.40 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ మొదటి పారితోషకం ఎంత? ఏం చేశారు? అనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. 17 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీలో కి అడుగు పెట్టిన ఈయన 2001లో నిన్ను చూడాలని సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

Do you know how much NTR's first salary was?
Do you know how much NTR’s first salary was?

ఇంకా 18 సంవత్సరాలు కూడా నిండకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి రికార్డులు సృష్టించాడు. నందమూరి వంశం నుంచి వచ్చి బాలయ్య తర్వాత స్టార్ హీరోగా ఎన్టీఆర్ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు బాబాయ్ కంటే చాలా పైనే ఉన్నాడని చెప్పాలి.స్టూడెంట్ నెంబర్ వన్, ఆది సినిమాలతో తానేంటో నిరూపించుకొని..సింహాద్రి సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు. ఆ తర్వాత ఇప్పటివరకు వెనుతిరిగి చూసుకోలేదు. ఇకపోతే తన మొదటి సినిమా నిన్ను చూడాలని డిజాస్టర్ అయ్యింది. కానీ ఈయనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ కి నిర్మాత రామోజీరావు రూ.4 లక్షల పారితోషకం వచ్చారట. ఇంత డబ్బు ఏం చేయాలో తెలియక ఆ డబ్బులను తన తల్లికి బహుమతిగా ఇచ్చినట్లు తెలిపాడు ఎన్టీఆర్.