Mahesh Babu : మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా లో అతిపెద్ద తప్పు .. చూసుకోవాలి కదయ్యా మహేష్ బాబూ .. !

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కసారి తనకి ఏ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తే.. వాళ్లకి తనతో మరో సినిమా చేయడానికి ఛాన్స్ ఇస్తాడు.. అలా త్రివిక్రమ్ తోపాటు మరికొంత మంది దర్శకులు ఉన్నారు. అయితే వాళ్ళు ఆ ఛాన్స్ ను ఫుల్ గా వాడుకుని మహేష్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు.. కానీ శ్రీకాంత్ అడ్డాల మాత్రం ఆ విషయంలో తడబడ్డాడు.. ఇదంతా బ్రహ్మోత్సవం సినిమా గురించి..

Do you find out these mistake on bramhotsavam movie
Do you find out these mistake on bramhotsavam movie

సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా బ్రహ్మోత్సవం.. ఈ సినిమా భారీ అంచనాల నడుమ 2016 మే 20న రిలీజై.. డిజాస్టర్ ను మూటగట్టుకుంది.. ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే భారీ ఫ్లాప్ గా నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మహేష్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడంతో డైరెక్టర్ కి ఈ ఆఫర్ ఇచ్చాడు మహేష్.. కానీ అది నిలబెట్టుకోలేక పోయాడు శ్రీకాంత్ అడ్డాల.. తాజాగా ఈ సినిమాలో ఈ తప్పు గమనించారా అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అదేంటంటే.. ఈ చిత్రం లో మహేష్ తల్లి రేవతి తన కుమార్తె తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మహేష్ వచ్చి తన సోదరిని సరదాగా ఏడిపిస్తాడు. అయితే ఈ వాళ్ళు వీడియో కాల్ మాట్లాడే సమయంలో కాల్ మ్యూట్ లో ఉంటుంది. దాన్ని గుర్తించిన నెటిజన్లు.. మ్యూట్ లో ఉన్నప్పుడు కాల్ ఎలా మాట్లాడుతున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది..

ఫామిలీ చిత్రాలు తీయడం లో సిద్ధహస్తుడు అయిన శ్రీకాంత్ అడ్డాల కథ, కథనం, పాత్రల విషయాల్లో ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. దీంతో ఈ చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. ఫలితంగా ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంత చిన్న లాజిక్ మిస్స్ అయితే ఇలా శ్రీకాంత్ అడ్డాల చూసుకోవాలి కదయ్యా అని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.