Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ని మొదలు పెట్టి ఆ తర్వాత నిర్మాతగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఇటీవల దిల్ రాజు తన సినిమాల కన్నా రెండో పెళ్లి విషయాలతో వార్తలలో నిలుస్తూ వస్తున్నాడు. మొదటి భార్య అనిత మరణించాక లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ నిబంధనల మేరకు కేవలం అత్యంత సన్నిహితుల మధ్య రెండో వివాహం చేసుకున్నాడు.. 49 ఏళ్ల వయసులో దిల్ రాజు నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలోని వెంకటేశ్వర స్వామి గుడిలో రాత్రి 11 గంటల సమయంలో వివాహం చేసుకున్నారు.

ఇది అసలు విషయం..
దిల్ రాజు పెళ్లికి పెద్దగా ఆయన కూతురు హన్షిత రెడ్డి ఉంది. అన్నీ తానై చూసుకుంది.. అయితే దిల్ రాజు రెండో పెళ్లి ఎందుకు చేసుకోవల్సి వచ్చింది అనే విషయంపై అందరిలో చర్చలు నడుస్తుండగా, తాజాగా తన రెండో పెళ్లి వెనుక అసలేం జరిగింది అనే విషయాలను ఆయన వివరంగా చెప్పుకొచ్చారు. ‘‘నా భార్య అనిత చనిపోయే సమయానికి నాకు 47 ఏళ్లు కాగా, ఆ సమయంలో నా భార్యను కోల్పోవడంతో ఎమోషనల్గా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నేను రోజంతా ఎక్కడకి వెళ్లిన సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తా హఠాత్తుగా భార్యను కోల్పోవడంతో రెండేళ్ల పాటు ఆ బాధలోనే ఉండిపోయాను.
భార్య మరణించాక రెండేళల పాటు నా కూతురు, అల్లుడు నా ఇంట్లోనే ఉన్నారు. అయినా సరే లోటు తీరకపోవడంతో నాకు మళ్లీ పెళ్లి చేయాలని మా అమ్మా నాన్నా ఆలోచించారు. నా కూతురు కూడా అదే భావించింది. వేరే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను కూడా పరిశీలించగా, . వైదా నాకు కరెక్ట్ అనిపించింది. అంతకుముందు తనతో నాకు అసలు పరిచయం లేదు.అయితే సెలబ్రిటీలు అన్నాక చాలా విచిత్ర పరిస్థితులు ఉంటాయి. అవన్నీ ఆమెకు వివరించి పెళ్లి చేసుకున్నాను. ఇక ఇటీవల నాకు బిడ్డ పుట్టగా, నా మొదటి భార్య అనిత, రెండో భార్య వైదా పేర్లు కలిసొచ్చేలా వాడికి ‘అన్వయ్’ అని పేరు పెట్టం అని దిల్ రాజు వివరించాడు.