NTR : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. రాజకీయాలలోకి రావాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలపై ఆసక్తి చూపించడం లేదు.. కానీ ఇటీవల ఆయన సోదరుడు తారకరత్న .. ఎన్టీఆర్ తప్పకుండా వచ్చే ఎన్నికలలో టీడీపీ పార్టీ ప్రచారానికి వస్తాడు అంటూ క్లారిటీ ఇచ్చాడు. రాజకీయ రంగంలో ప్రస్తుతం పలు వార్తలు వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.

త్వరలోనే వచ్చే ఎన్నికలలో టిడిపి తరఫున తాను కూడా పోటీ చేస్తానని.. బాలయ్య బాబాయ్ కి అబ్బాయ్ గా, చంద్రబాబు నాయుడు మామయ్య కి అల్లుడిగా మీ మన్ననలు పొందుతాను. కచ్చితంగా గెలుస్తాను అంటూ తెలిపాడు . అంతేకాదు ఎన్టీఆర్ రావాల్సిన సమయంలోనే వస్తాడు కచ్చితంగా ప్రచారానికి పాల్గొంటాడు చంద్రబాబు మళ్ళీ సీఎం అవుతాడు.. తిరిగి పూర్వ వైభవాన్ని ఆంధ్ర ప్రదేశ్ పొందుతుంది.. అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేశాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించడం లేదు అని.. మునుపటి వైభవం రావాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కూడా తారక్ తెలిపారు. అంతేకాదు అంతా కలిసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కూడా కోరారు.