Venkatesh : ఎక్కువగా ఫ్యామిలీ రిలేటెడ్ సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ప్రేక్షకులని ఎక్కువగా తన అభిమానులుగా మార్చుకున్న ఏకైక హీరో వెంకటేష్ అని చెప్పవచ్చు. మాస్ హీరోగా.. కామెడీ హీరోగా కూడా ప్రేక్షకులను అలరించిన ఈయన ఈ మధ్యకాలంలో వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంటున్నారు. ఇకపోతే ఈరోజు వెంకటేష్ పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోని సినిమాల్లోకి వచ్చిన తర్వాత వెంకటేష్ ఎంత ఆస్తి కూడబెట్టారు.. తండ్రి నుంచి ఎంత ఆస్తి వారసత్వంగా వచ్చింది.. అనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

1986లో కలియుగ పాండవులు సినిమా ద్వారా ప్రముఖ నిర్మాత డి రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. నాటి నుంచి నేటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10వేలకోట్ల పారితోషకం తీసుకుంటున్నారు. ఆయన సినీ ప్రస్థానంలో సుమారుగా రూ. 2,500 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. తండ్రి నుంచి వారసత్వంగా మరో రూ.2000 కోట్లు లభించాయి. అలాగే తన అన్నయ్య సురేష్ బాబు మెయింటైన్ చేస్తున్న ప్రొడక్షన్ హౌస్ లో కూడా వాటా ఉంది. వీటితోపాటు ఖరీదైన ప్రాపర్టీలు, ఇల్లు , కార్లు మొత్తం కలిపి సుమారుగా రూ.5000 కోట్లకు పైగా ఆయన ఆస్తి ఉన్నట్లు సమాచారం.