Singer sunitha – Naga Chaitanya : నాగచైతన్య కి.. సింగర్ సునీత కూతురికి మధ్య ఉన్న బంధం ఏంటో తెలుసా..? 

Singer sunitha – Naga Chaitanya :  సంగీత అభిమానులకు సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మామూలుగా నటులకు గుర్తింపు , స్టార్ స్టేటస్ ఉంటుంది . కానీ సింగర్ సునీతకి, ఆమె గాత్రానికి ప్రత్యేకంగా అభిమానులు ఉండడమే కాకుండా ఆమె అందం అంటే పడి చచ్చిపోయే యువత కూడా ఉంది. అంతేకాదు ఇప్పుడున్న లీడ్ సింగర్లలో సునీత కూడా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. తన మధురమైన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే మ్యాంగో డిజిటల్ వీడియో అధినేత రామ్ వీరపనేని ని రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే . అయితే అప్పటినుంచి ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మరింతగా అభిమానులకు దగ్గరవుతున్నారు.

Did you know relationship between Naga Chaitanya and Sunitha daughter Shreya..!
Did you know relationship between Naga Chaitanya and Sunitha daughter Shreya..!

ఇదిలా ఉండగా తాజాగా సునీత కూతురు శ్రేయ గోపిరాజుకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఆ వార్త ఏమిటంటే అక్కినేని వారసుడు యంగ్ హీరో నాగచైతన్యకి సింగర్ సునీత కూతురు శ్రేయ గోపిరాజుకి మధ్య ఉన్న బంధం ఏమిటి అన్న వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.. అసలు విషయంలోకెళితే సింగర్ సునీత వారసత్వాన్ని ఉనికిపుచ్చుకొని శ్రేయ గోపిరాజు కూడా మొదటిసారి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సింగర్ గా అడుగుపెట్టారు. అసలు విషయంలోకి వెళితే.. చందు మొండేటి దర్శకత్వంలో 2018 నవంబర్ 2న విడుదలైన అక్కినేని నాగచైతన్య సవ్యసాచి సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

అయితే ఈ సినిమా ద్వారానే శ్రేయ గోపిరాజు కూడా మొదటిసారి ఇండస్ట్రీలోకి సింగర్ గా అడుగుపెట్టింది ఇందులో “టిక్ టిక్ టిక్ ” అనే పాట పాడి శ్రోతలను బాగా అలరించింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రేయ గోపిరాజుకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆమె సైంటిస్ట్ అవ్వాలని కోరికతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నాగచైతన్య సినిమా ద్వారానే తన సినీ కెరియర్ను మొదలుపెట్టారు శ్రేయ గోపిరాజు.