Ramcharan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. తన భార్య ఉపాసనను వివాహం చేసుకొని 2022 నాటికి 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇటీవల తల్లిదండ్రులు కాబోతున్నట్లు చిరంజీవి ట్విట్టర్ వేదికగా తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఆస్తి ఎంత ఉంటుంది అనే వార్త కూడా వైరల్ గా మారుతోంది. రామ్ చరణ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమా ద్వారా రూ.100 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు ఇప్పటివరకు చరణ్ రూ.1,400 కోట్లు విలువచేసే నికర ఆస్తులను కలిగి ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అత్యంత విలాసవంతమైన బంగ్లా కోసం రూ.30 కోట్లు వెచ్చించాడు. దీని విస్తీర్ణం 25 వేల చదరపు అడుగులు. ప్రఖ్యాత ఇంటీరియర్ డిజైనర్ తరుణ్ తహిలియా నే దీనికి డిజైన్ చేశారు.. ఈ ఇంట్లో రామ్ చరణ్, తన భార్య ఉపాసన, తండ్రి చిరంజీవి, తల్లి సురేఖ ఉంటున్నారు. ఇందులో భారీ స్విమ్మింగ్ పూల్, జిమ్నాసియం , టెన్నిస్ కోర్ట్, షిప్ పాడ్ తో సహా అత్యాధునిక సౌకర్యాలు కూడా ఉన్నాయి ఇక హైదరాబాద్లో ఉన్న ఇంటి తో పాటు ముంబైలో ఖార్ లో కూడా ఒక అద్భుతమైన పెంట్ హౌస్ ఉన్నట్లు సమాచారం దీని విలువ కూడా సుమారుగా రూ. 30 కోట్ల పైనే అన్నమాట.