Dhanush : ధనుష్ సార్ కి వెళ్తే సూపర్ స్టార్ విజువల్ ట్రీట్.. పునాకలే..

Dhanush :  తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ చిత్రం వాతి.. ఈ సినిమానే తెలుగులో సార్ గా విడుదల చేయనున్నారు. రేపు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను తెలుగు , తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయమన్నారు మేకర్స్.. ఈ సినిమా చూసే వారికి మరో గుడ్ న్యూస్ కూడా..

ఇటీవల హీరో సినిమాకి వెళ్తే మరో హీరో సినిమాకు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేయడం కామన్ అయిపోయింది. ఇప్పుడు అదే ఫార్ములా ను సూపర్ స్టార్ విజయ్ కూడా ఫాలో అవుతున్నాడు. హీరో ధనుష్ సినిమాతో పాటుగా తన సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

వాతి సినిమా స్క్రీనింగ్ రైట్స్ ను కొనుగోలు చేసిన సెవన్ స్క్రీన్ స్టూడియోస్ వారు.. లియో యొక్క టైటిల్ టీజర్ ను కూడా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సార్ సినిమా స్క్రీనింగ్ అవబోతున్న సుమారు 5000 స్క్రీన్ లో సూపర్ స్టార్ విజయ్ యొక్క లియో టైటిల్ టీజర్ స్క్రీనింగ్ అవుతుంది. ఒకే స్క్రీన్ మీద ధనుష్ సినిమా ఆ తరువాత విజయ్ టీజర్ తో విజువల్ ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు.

ధనుష్ సినిమాని చూడడానికి వెళ్ళిన వారికి సూపర్ స్టార్ విజయ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. లియోపై తమిళం తో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . ఈ సినిమాపై విజయ్ లోకేష్ కనకరాజ్ భారీ విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి.