టాలీవుడ్ సూపర్ స్టార్స్ మహేష్ బాబు, ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ ఇద్దరే అని చెప్పుకోక తప్పదు. ఈ బడా స్టార్ల మధ్య వున్న స్నేహ బంధం గురించి అందరికీ తెలిసినదే. సినిమా షూటింగులతో ఎంత బిజీగా వున్నా, అప్పుడప్పుడు కలిసి పార్టీలు చేసుకుంటారు మన హీరోలు. మీరు సరిగ్గా గమనిస్తే వీరి ఇద్దరి మధ్య చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. సాధారణంగా వీరు జనం ముందు మాట్లాడటానికి చాలా సిగ్గుపడతారు. ఏ సినిమా పరిశ్రమలోనైనా హీరోలన్నవారికి ప్రేమించే వారితో పాటు ద్వేషించే సంఘాలు కూడా ఉంటాయి. అయితే వీరిని ఇష్టపడని వారు చాలా తక్కువ.
ఇద్దరికీ సినిమా నేపథ్యం అనేది బలంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాతే ఇద్దరూ నటన నేర్చుకున్నారు. ఎలాంటి నేపధ్యం ఉన్నప్పటికీ వారికంటూ చాలా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇద్దరూ 6 అడుగుల కంటే కాస్త ఎక్కువ ఎత్తుని కలిగివున్నవారే. ఇంకో విషయం ఇక్కడ చెప్పుకోవాలి… ఇద్దరికీ లేడీ ఫ్యాన్ బేస్ బాగా ఉంటుంది. ఇది చిత్ర సీమలో మరే ఇద్దరి హీరోలకు లేని విషయం అని చెప్పుకోవచ్చు.
అదేవిధంగా మాస్ మరియు క్లాస్ అనేతేడాలేకుండా ఇద్దరికీ అభిమానుల ఫాలోయింగ్ మెండుగా ఉంది. ఇద్దరికీ ఇండస్ట్రీలో రికార్డులు ఉన్నాయి. ఇద్దరూ భారతదేశంలో మోస్ట్ డిజైరబుల్ పురుషులు. నటనలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక శైలి. మహేష్ బాబు ఎప్పుడూ అతిగా నటించడు. ప్రభాస్ కూడా అంతే.. నటనలో అతి అనేది కనిపించదు. చివరగా, ప్రతి ఒక్కరు తమదైన సొంత శైలిలో ఉత్తమంగా నటించడానికి యత్నిస్తారు.
అందుకే వీరంటే తెలుగు సినిమా ప్రేక్షకులను మక్కువ కాస్త ఎక్కువ. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపైన మరొకరు ఇష్టాన్ని ప్రకటించుకుంటారు. ఆమధ్య మహేష్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా డార్లింగ్ ప్రభాస్ పైన ఇష్టాన్ని బాహాటంగానే చాటుకున్నాడు. డార్లింగ్ అంటే తనకి కూడా చాలా ఇష్టమని, తాను ఇష్టపడే నటుల లిస్టులో ప్రభాస్ తప్పకుండా ఉంటారని చెప్పుకొచ్చాడు. దాంతో డార్లింగ్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే విషయం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.