Singer Sunitha : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె రూపంలో ఎంత అందంగా ఉంటుందో.. మనసుపరంగా అంతే గొప్పగా ఆలోచిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సునీత పాటలను వినని వారు.. ఆమె గొంతును ఇష్టపడని వారు బహుశా ఉండరేమో.. అంతలా తన గొంతుతో మధురంగా పాటలు పాడి శ్రోతలను అలరిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సునీత రామ్ వీరపనేని వివాహం చేసుకున్న తర్వాత మరింత ఉత్సాహంగా మారింది. ముఖ్యంగా పెళ్లి తర్వాత సునీతలో రెట్టింపు ఉత్సాహాన్ని మనం చూస్తున్నాము.

సమయం, సందర్భం లేకపోయినా సరే తన ప్రతి విషయాన్ని కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మరింత ఆనందాన్ని పొందడమే కాకుండా తన ఫోటోలతో అభిమానులకు కూడా మరింత ఆనందాన్ని కలుగజేస్తోంది. సింగర్ గా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేసిన సునీత పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది. ఇదిలా ఉండగా గతంలో సునీత చేసిన ఒక పని తెలుసుకొని అభిమానులు మీరు నిజంగా సూపర్ మేడం అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కష్టకాలంలో కూడా అలాంటి అద్భుతమైన ఆలోచన చేసి ప్రజల ప్రాణాలను కాపాడారు అని అందరూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే .. కరోనా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ.. తన మాటలు.. చిన్నచిన్న కూని రాగాలతో అందరినీ రిలాక్స్ చేశారు. కరోనా సమయంలో ఎవరు బయటికి పోకుండా.. తన పాటలతో అందరినీ అలరిస్తూ వారి ప్రాణాలను కరోనా బారిన పడకుండా కాపాడారు. లైవ్ లో నెటిజెన్స్ కోరిన పాటలన్నీ కూడా ఆమె పాడి వినిపించారు.. కరోనా సమయంలో ఎవరు బయటకు వెళ్ళకండి అని చెబుతూనే కరోనా సమయంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తల గురించి కూడా ఆమె వెల్లడించారు. మొత్తానికైతే సునీత చేసిన ఈ పనికి అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.