Telugu cinema secrets : అప్పట్లో ముఖ్యమంత్రికే చెమటలు పట్టించిన కమెడియన్ రాజబాబు..కారణం..?

Telugu cinema secrets :  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ తో సమానంగా అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా వారితో సమానంగా పారితోషకం తీసుకున్న ప్రముఖ సినీ హాస్య నటుడు రాజబాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా ఒక వెలుగు వెలిగిన రాజబాబు శతాబ్దపు హాస్యనటుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఇక తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన రాజబాబు నిజజీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు కలిగిన వాడు. అంతేకాదు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అద్దాల నారాయణరావు రాజబాబుకి సమాజం అనే సినిమాలో అవకాశం కల్పించారు.

మొదటి సినిమా తర్వాత తండ్రి కొడుకులు, కుల గోత్రాలు ,స్వర్ణ గౌరీ , మంచి మనిషి మొదలగు చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. ఇక తర్వాత పిచ్చోడి పెళ్లి, తిరుపతి , ఎవరికి వారే యమునా తీరే, తాత మనవడు, మనిషి రోడ్డున పడ్డాడు లాంటి సినిమాలలో హీరోగా కూడా నటించారు. ఎవరికి వారే యమునా తీరే, మనిషిని రోడ్డున పడ్డాడు వంటి సినిమాలకు స్వయంగా బాబ్ అండ్ బాబ్ ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ఆయనే స్వయంగా సినిమాలను నిర్మించారు. ఇక ఎన్టీఆర్ , ఏఎన్నార్ , శోభన్ బాబు , కృష్ణ లాంటి హీరోలతో నటించిన ఒకే ఒక్క హాస్యనటుడు కూడా ఈయనే. ఇక రోజుకు 20 గంటలు షూటింగ్లో పాల్గొనేవారు. ఇక రాజబాబుకి రక్షణగా ఇద్దరు పోలీసులు కూడా ఉండేవారు.

Comedian Rajababu who made the chief minister sweat at that time

ఇకపోతే తమిళనాడులో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతోనే సవాళ్లు విసిరి గొడవకు దిగారు. అప్పట్లో ఎంజీఆర్ మద్యాన్ని బహిష్కరించారు. దీంతో ఒకరోజు రాజబాబు తాగి కారు నడపడంతో పోలీసులు ఆయనను అవమానించడంతో.. ఏకంగా ఎంజీఆర్ ఇంటికి వెళ్లి ఎంజీఆర్ తో నన్ను అవమానిస్తారా అని ప్రశ్నించాడు. దీంతో ఎంజీఆర్ రాజబాబును అవమానించిన పోలీసులను పిలిపించి ఇతడు తాగినా ఆపవద్దు అని చెప్పారు. అలాగే ఆయనకి ఇద్దరు పోలీసులను రక్షణగా కూడా పెట్టారు. ఇక అలా ఏకంగా సీఎం తోనే గొడవపడ్డాడు రాజబాబు ఇక ఆ తర్వాత ఒకరోజు రాత్రి ఏదో గొంతులో ఇబ్బంది వచ్చి హైదరాబాద్లోని థెరీసా ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ ఫిబ్రవరి 14 1983లో తుది శ్వాస విడిచారు.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

8 months ago

This website uses cookies.