Veerasimhareddy : బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతి రేసులో నందమూరి నరసింహ బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి.. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికి ఈ రెండు సినిమాలు కలెక్షన్లలో దూసుకెళ్తూ రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి.. ముఖ్యంగా వీరసింహారెడ్డి కలెక్షన్స్ పై ఓ రేంజ్ లో రికార్డులు నమోదు అయ్యాయి.. చిరంజీవి కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తున్నారు..

వీర సింహారెడ్డి సినిమా 7 రోజుల్లో మొత్తం మీద 115 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుందని. వాల్తేరు వీరయ్య బాక్స్ ఆఫీస్ వద్ద 155 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలు చేశారని.. ఈ రెండు సినిమాలు అంచనాలను మించిపోతూ కలెక్షన్లను సాధిస్తున్నాయి.. ఒక పక్క చిరంజీవి టాప్ అంటుంటే.. మరోపక్క బాలయ్య టాప్ అంటూ ఎవరి ఫ్యాన్స్ వారు రచ్చ చేస్తున్నారు. వీళ్ళ కలెక్షన్స్ పై సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతుంది..
అయితే చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్స్ న్స్ ఫేక్ అంటూ బాలయ్యకి చిరంజీవికి మధ్యన సుమారు 40 కోట్ల రేంజ్ లో గ్రాస్ గ్యాప్ ఉందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇవన్నీ ఫేక్ లెక్కలని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారని .. బాలయ్య కలెక్షన్స్ నిజమని మెగా ఫాన్స్ కావాలని ఎక్కువ మార్జిన్ ఉన్న న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
మెగాస్టార్ మీద ఉన్న అభిమానం కొద్ది మెగా ఫాన్స్ ఇలా చేయడం కరెక్ట్ కాదని నేటిజన్స్ వాదన అఫీషియల్ గా మాత్రం ఇద్దరూ కలెక్షన్లలో కాస్త గ్యాప్ లో ఉన్నారన్నమాట వాస్తవమే కానీ మరీ పదుల సంఖ్యలో వ్యత్యాసం లేదనేది సమాచారం. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి బాక్స్ ఆఫీస్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. అప్పటివరకు ఇలాంటి న్యూస్ వైరల్ అవుతూనే ఉంటాయి.