బిగ్ బ్రేకింగ్ : OTT లో వాల్తేరు వీరయ్య – డేట్ వచ్చేసింది !

బిగ్ బ్రేకింగ్ : మెగాస్టార్ చిరంజీవి శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య.. ఈ సినిమా ప్రీమియర్ షో నుంచి హిట్ టాక్ తో దూసుకెళ్లింది.. మెగాస్టార్ ఈ సినిమాలో వన్ మ్యాన్ మాస్ గా ముందుకు తీసుకెళ్లాడు.‌ చిరు మాస్ యాక్షన్ కి రవితేజ క్రేజ్ తోడవడంతో బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య విజయభేరి మోగించింది..

Chiranjeevi walteru Veeraiah OTT release date out
Chiranjeevi walteru Veeraiah OTT release date out

వాల్తేరు వీరయ్య సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్స్‌లో విడుదలైంది.
మిగితా ఏరియాలతో పోల్చితే నైజాంలో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకుంది. ఒక్క నైజాం ఏరియానే కాదు.. అటు సీడెడ్, ఉత్తరాంధ్రలోను మంచి కలెక్షన్స్ నమోదయ్యాయి.. చిరంజీవి కెరియర్ లో టూ మిలియన్ అందుకున్న మూడో సినిమాగా రికార్డు క్రియేట్ చేయడం మరో విశేషం. ఇంతకుముందు సైరా, ఖైదీ నంబర్ 150 కూడా అందుకున్నాయి.

వాల్తేరు వీరయ్య సినిమా ఓవర్సీస్ లో 2.5 మిలియన్ డాలర్స్ అందుకుంది. ఇటీవల ఈ చిత్రం 25 రోజుల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. దాంతో ఈ సినిమా ఓటిటీ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది ఫిబ్రవరి 27 నుండి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది . ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా.. ఈనెల 27 నుండి ఓటీటీ లో రచ్చ షురూ కానుంది.

ఓటీటీ లో విడుదలైన ఈ సినిమా ఎన్ని వండర్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ హిట్టుగా నిలిచింది. చిరంజీవి మరోసారి తన స్టామినా చూపించారు. మొత్తానికి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 27న స్ట్రీమింగ్ కానుంది.