waltair veerayya : తాజాగా చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య జనవరి 13వ తేదీన సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న విషయం తెలిసిందే.. అయితే సినిమా విడుదలకు ముందే తొలి రివ్యూ ఇచ్చే ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు ఈసారి వాల్తేరు వీరయ్య చిత్రానికి చాలా నిరాశ జనకంగా రివ్యూ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా ఆయన తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా వాల్తేరు వీరయ్య ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా ఉమైర్ సందు తొలి రివ్యూ ఇలా రాసుకు వచ్చారు. ” చిరంజీవి గారు దయచేసి ఇలాంటి రొమాంటిక్ రోల్స్ మీరు చేయడం మానేసి.. సీరియస్ రోల్స్ చేస్తే బెటర్.

మిమ్మల్ని ఇలాంటి తరహా పాత్రలలో చూసి బోర్ కొట్టేసింది. వాల్తేరు వీరయ్య చిరంజీవికి మరో డిజాస్టర్ కానుంది అంటూ ట్వీట్ చేశారు. రొటీన్ కమర్షియల్.. రొమాంటిక్ రోల్స్ కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేయండి.. వాల్తేరు వీరయ్య సినిమాలో ఎలాంటి కొత్తదనం కనిపించలేదు..” పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోదు అంటూ పరోక్షంగా తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. అయితే ఈయన చేసిన ట్వీట్ అభిమానులను నిరాశపరిచే విధంగా ఉంది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.