Chiranjeevi – Venkatesh : చిరంజీవి వెంకటేష్ క్రేజీ కాంబో షురూ.. థియేటర్స్ లో రచ్చ రచ్చే..!!

Chiranjeevi – Venkatesh : మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాల్ని లైన్ లో పెడుతున్నారు. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ను బాలీవుడ్ సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.. చిరంజీవి తాజాగా కొత్త సినిమాలో విక్టరీ వెంకటేష్ తో నటిస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. చిరంజీవి వెంకీ మామ కలిసి నటిస్తే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు..! వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న సినిమాకు డైరెక్టర్ ఎవరు అంటే..!? మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆచార్య అనే సినిమాతో పలకరించిన విషయం తెలిసిందే.. అనేక వివాదాల తర్వాత మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరు కలిసి పూర్తిస్థాయిలో నటించిన సినిమాపై ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. తన నెక్స్ట్ సినిమాలపై చాలా కేరింగ్ గా ఉండాలని చిరంజీవి అనుకుంటున్నారట.. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్లో కొంచెం బిజీగా ఉన్నారు దీంతో పాటు’ వాల్తేరు వీరయ్య’ అనే చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీస్ క్రియేషన్స్ నిర్మిస్తున్న వాల్తేర్ వీరయ్య అనే సినిమాలో. చిరు క్యారెక్టర్ మత్స్యకారకుడుగా ఉండబోతున్నట్లు అంతేకాకుండా మత్స్యకారులకు నాయకుడిగా వహిస్తున్నట్లు సినిమాలో కనిపించబోతున్నారట.

Chiranjeevi venkatesh acting together on waltair veerayya movie
Chiranjeevi venkatesh acting together on waltair veerayya movie

మత్స్యకారుల జీవితంపై పెత్తనాన్ని చెలయించి మార్కెట్ ఆధిపత్యాన్ని ప్రశ్నించే నాయకుడిగా చిరంజీవి నడిపిస్తున్నారని సినీ వర్గాల టాక్. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇండస్ట్రీలో నటిస్తుంది.. అదేమిటంటే వాల్తేరు వీరయ్య సినిమా విక్టరీ వెంకటేష్ ఒక అతిధి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.. మెగాస్టార్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా నటిస్తున్నారని గట్టిగా సమాచారం అందుతుంది.. కాగా ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా సినిమాలో హీరోయిన్స్ గా సముద్ర ఖని, బాబీ సింహా, కేథరిన్ ముఖ్యమైన పాత్రలో సందడి చేయనున్నారు. సినిమాలో చిరంజీవి ఊర మాస్ లుక్ లో కనిపిస్తారట. చిరంజీవికి జంటగా శృతిహాసన్ చేస్తున్నట్లు సమాచారం.

Advertisement