ఈ సంక్రాంతికి ఒకేసారి రెండు పెద్ద హీరోల సినిమాలు విడుదల కానున్నాయి మూడున్నర దశాబ్దాల తర్వాత చిరంజీవి బాలకృష్ణ తమ సినిమాలతో బాక్స్ ఆఫీస్ రేసులో దిగుతున్నారు సంక్రాంతికి వీరిద్దరూ పోటీ పడితే ఆ మజానే వేరు చిరంజీవి వాల్తేరు వీరయ్య బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలు పోటీ పడుతున్నాయి పైగా ఈ రెండు సినిమాలలో శృతిహాసన్ హీరోయిన్ రెండు సినిమాలు కూడా ఒకే బ్యానర్ నుంచి వస్తున్నాయి ఈ రెండు సినిమాలకు మధ్యలో మరో అగ్ర నిర్మాత టాప్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు వారసుడు సినిమా కూడా రిలీజ్ కానుంది ఇక థియేటర్ల దగ్గర ఏ రేంజ్ లో ఫైట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

చిరంజీవి 25 ఏళ్ల క్రితం ఏదైతే జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పారు అంటే చిరు ఉద్దేశంలో 1997లో సంక్రాంతి స్పెషల్. ఆ సంక్రాంతికి చిరంజీవి హిట్లర్ బాలకృష్ణ పెద్దన్నయ్య రెండు సినిమాలు హిట్ అయ్యాయి. అదే సంక్రాంతికి మూడో సినిమా వెంకటేష్ చిన్నబ్బాయి డిజాస్టర్ అయింది. అంటే తనతో పాటు బాలయ్య సినిమా హిట్ అయ్యి మూడు సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు తన వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలు హిట్ అవుతాయని .. మూడో సినిమాకు చోటు ఉండదని పరోక్షంగా చెప్పారు అన్న వార్తలు ఊపందుకున్నాయి . 25 ఏళ్ల సీన్ రిపీట్ అవుతుందన్న చిరు ఇద్దరి సినిమాల సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు ఇక దిల్ రాజు విడుదల చేసే వారసుడు సినిమా ఫ్లాప్ అవుతుందా అనేది చూడాలి. మొత్తానికి ఈ మూడు సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయని ఆసక్తికరంగా మారింది. అయితే కొంతమంది మాత్రం తన సినిమానే ఓడిపోతుందని చిరంజీవి అన్నట్టుగా ఓ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.