Chiranjeevi God Father Review : ఇంటర్నెట్ లో ఫస్ట్ రివ్యూ — గాడ్ ఫాదర్ రివ్యూ……!

సినిమా పేరు: గాడ్ ఫాదర్
దర్శకుడు: మోహన్ రాజా
నటీనటులు: చిరంజీవి, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార, సునీల్, జబర్దస్త్ శ్రీను, పూరి జగన్నాథ్ ..తదితరులు.
నిర్మాతలు: ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్
సంగీతం: తమన్
విడుదల తేదీ: 05-10-2022
భాషలు: తెలుగు, హిందీ.

Advertisement

ఇంట్రడక్షన్ : మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన “లూసిఫర్” నీ తెలుగులో “గాడ్ ఫాదర్” గా రీమేక్ చేసిన సినిమా ఇది. మలయాళ న్యూస్ ఫర్ స్క్రిప్ట్ మొత్తం మార్పులు చేర్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా చాలా హోం వర్క్ చేసి ‘గాడ్ ఫాదర్” గా రూపొందించారు. దర్శకుడు మోహన్ రాజా ఆధ్వర్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ముఠామేస్త్రి తర్వాత ఆ తరహా రాజకీయ నేతగా దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత చిరంజీవి “గాడ్ ఫాదర్” లో నటించడం జరిగింది. ఈ సినిమాలో చిరంజీవితోపాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. చాలాకాలం తర్వాత సునీల్ కూడా చిరంజీవి సరసన ఫుల్ లెన్త్ రోల్ చేయటం జరిగింది. ఈ రకంగా ఎన్నో ఆర్భాటాలు హంగులు కలిగిన.. గాడ్ ఫాదర్ నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల అయింది. అయితే ఈ సినిమాకి సంబంధించి రిజల్ట్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement
Chiranjeevi God Father Review and Rating in Telugu
Chiranjeevi God Father Review and Rating in Telugu

కథ:- అధికార పార్టీ నేత ముఖ్యమంత్రి పీకే రాందాస్ మెడికల్ ఇన్స్టిట్యూట్, హాస్పిటల్ వద్ద అకస్మాత్తుగా మరణించడం జరుగుద్ది. అయితే ఆ వైద్య విద్యాసంస్థలు ఆసుపత్రి ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూతురికి చెందినది. సో అదే హాస్పిటల్ వద్ద ముఖ్యమంత్రి మరణించడంతో… పెద్ద గొడవలు జరుగుతాయి. ఈ క్రమంలో కొన్ని పార్టీలు ప్రభుత్వాన్ని కొలత వేయడానికి ప్రయత్నాలు చేయటం జరుగుద్ది. ఆ సమయంలో పీకే రామదాసు ముఖ్యమంత్రి కుర్చీలో సత్యదేవ్ సీఎంగా బాధ్యతలు తీసుకుంటాడు. దీంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన హాస్పిటల్ వద్ద ముఖ్యమంత్రి చనిపోవడంతో సత్యదేవ్ ముఖ్యమంత్రిగా అనేక గొడవలు చేస్తూ రాజకీయం నడిపిస్తాడు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి ఇంటర్నేషనల్ డ్రగ్ క్రిమినల్ ఖురేషి అబ్రహంకి సంబంధం ఉంటుంది. ఇక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న సత్యదేవ్ కి కూడా ఖురేషి అబ్రహంతో సంబంధాలు ఉంటాయి. అయితే పీకే రాందాస్ అత్యంత సన్నిహితుడు బ్రహ్మ (చిరంజీవి) ఈ గొడవల జరుగుతున్న సమయంలో రంగంలోకి దిగుతాడు. పీకే రామదాసు మరణానికి కారకులు ఎవరు..?, ఎందుకు చంపారు?, ఈ ఖురేషి అబ్రహం పాత్ర ఎంత మేరకు ఉంది..? రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ హవాలా వెనకాల ఎవరు ఉన్నారు..? మొత్తం విషయాలన్నీ బ్రహ్మ బయట పెట్టేస్తాడు. అయితే బ్రహ్మ కి పీకేఆర్ మధ్య సంబంధం ఏమిటి..? పికేఆర్ నీ ఎవరు చంపారు అనేది బ్రహ్మ ఎలా బయటపెట్టాడు..? చివరిగా రాష్ట్రంలో రాజకీయాన్ని బ్రహ్మ ఏ విధంగా మలుపులు తిప్పాడు అనేది వెండితెరపై చూడాల్సిందే..

విశ్లేషణ : “గాడ్ ఫాదర్” సినిమా మెగా అభిమానులకు ఫుల్ మీల్స్ సినిమా అని చెప్పవచ్చు. శంకర్ దాదా ఎంబిబిఎస్ తర్వాత సేమ్ అదే ఎనర్జీతో “గాడ్ ఫాదర్” లో చిరంజీవి మరోసారి తన నటన విశ్వరూపం ఏంటో చూపించారు. మలయాళం లో లూసిఫర్ సినిమా చాలా స్లోగా ఉంటుంది. కానీ తెలుగు నేటివిటీకి సరిగ్గా సూటయ్యే రీతిలో ‘గాడ్ ఫాదర్’ నీ రూపొందించడంలో దర్శకుడు మోహన్ రాజా నూటికి నూరుపాళ్ళు విజయం సాధించాడు అని చెప్పవచ్చు. సినిమా స్టార్ట్ అయిన నాటి నుండి ఇంటర్వెల్ వరకు… ప్రేక్షకుడికి ఏమాత్రం బోర్ కొట్టించకుండా.. నడిపించిన తీరు అత్యద్భుతం. ఎక్కడా కూడా అనవసరమైన సన్నివేశాలు పెట్టకుండా రైటింగ్ మరియు డైలాగులు సినిమాలో అద్భుతంగా ఉన్నాయి. ఇంకా చిరంజీవి ఇంట్రడక్షన్ షాట్స్చాలా అద్భుతంగా తెరకెక్కించాడు.

ఇంక మెయిన్ గా చెప్పుకోవాలంటే మరోసారి తమన్ తన సత్తా ఏంటో నిరూపించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చెలరేగిపోయాడు. అఖండ, బీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ కావటంలో తమన్ పోషించిన పాత్ర గాడ్ ఫాదర్ లో మరోసారి రిపీట్ అయింది. ఇంకా సల్మాన్ ఖాన్ నీ ఎంతవరకు ఉపయోగించుకోవాలో ఆ రీతిగా ఉపయోగించుకున్నారు. సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు.. సినిమాకి అతిపెద్ద హైలెట్స్. ఇంకా సత్యదేవ్, నయనతార, సునీల్, వాళ్ల పాత్రలకు తగిన న్యాయం చేశారు. అయితే పాటలు ఇంకా ఫైట్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేశాయి. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు ఉన్నాయి. మిగతా సినిమా అంతా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. సింపుల్ స్టోరీ లైన్ తో వెండితెరపై మెగాస్టార్ తో మోహన్ రాజా గాడ్ ఫాదర్ తో వండర్ క్రియేట్ చేశాడని చెప్పవచ్చు. చివరిగా ఒరిజినల్ లూసిఫర్ కంటే “గాడ్ ఫాదర్” ప్రేక్షకులకు గూస్ బంప్స్ తీసుకొచ్చింది అని చెప్పవచ్చు.

పాజిటివ్ : తమన్ మ్యూజిక్
ఫస్టాఫ్
చిరంజీవి పెర్ఫార్మెన్స్
మోహన్ రాజా డైరెక్షన్

నెగిటివ్ : సెకండాఫ్
సాంగ్స్
ఫైట్స్

ఓవరాల్ : ఈ దసరాకి గాడ్ ఫాదర్ అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.

Advertisement